Dog Attack: పిచ్చికుక్క దాడి.. 20 మంది భక్తులకు గాయాలు
ABN , Publish Date - Dec 25 , 2025 | 10:19 AM
రాజన్న ఆలయం వద్ద ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఆలయానికి వచ్చిన భక్తులపై పిచ్చికుక్క దాడి చేసింది. దీంతో పలువురు భక్తులు గాయపడ్డారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా, డిసెంబర్ 25: వీధికుక్కల దాడులు ఓ సమస్యగా మారింది. ప్రధానంగా చిన్న పిల్లలు, వృద్ధులపై కుక్కలు దాడి చేస్తున్నాయి. కుక్కల దాడిలో అనేక మంది తీవ్రంగా గాయపడుతున్నారు. పలు ప్రాంతాల్లో వీధి కుక్కల దాడిలో కొంత మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనలు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న వారిపై కుక్కలు దాడి చేయడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎక్కడైనా కుక్కలు కనిపిస్తే చాలు అవి తమను కరుస్తాయనే భయంతో ఉంటున్నారు ప్రజలు. కానీ ఇప్పుడు మాత్రం ఓ ప్రముఖ దేవాలయం వద్ద పిచ్చికుక్క రెచ్చిపోయింది. ఆలయం వద్ద భక్తులపై దాడి చేసి పలువురిని గాయపరిచింది.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయం (Vemulawada Temple) వద్ద ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. ఆలయానికి వచ్చిన భక్తులపై కుక్క దాడి చేసింది. దాదాపు 20 మందికి పైగా భక్తులు పిచ్చి కుక్క దాడిలో గాయపడ్డారు. దీంతో వారిని వెంటనే సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఆలయం వద్ద పిచ్చి కుక్క దాడితో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవడంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిచ్చి కుక్క ఇలా ఇష్టం వచ్చినట్లు దాడి చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ వారు ఫైర అవుతున్న పరిస్థితి. వెంటనే ఆలయం వద్ద ఉన్న పిచ్చి కుక్కను పట్టుకోవాలని భక్తులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి...
ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మహిళలు మృతి
తీవ్ర విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌లోపడి ఆరేళ్ల బాలుడు మృతి..
Read Latest Telangana News And Telugu News