Rangareddy: యువకుడి దారుణ హత్య.. ఏం జరిగిందంటే?
ABN , Publish Date - Dec 25 , 2025 | 09:38 AM
రంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యువకుడిని కొందరు గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి చంపేశారు.
రంగారెడ్డి, డిసెంబర్ 25: రాను రాను సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకే హత్యల వరకు వెళ్లిపోతున్న పరిస్థితి. ఆస్తి, డబ్బు లావాదేవీలు, వివాహేతర సంబంధాలు ఇలా ఏదో ఒకరంగా అవతలి వాళ్లపై పగ పెంచుకుని మరీ వారిని అతి కిరాతంగా హత్య చేసేందుకు కూడా వెనకాడం లేదు కొందరు వ్యక్తులు. మరికొందరు అప్పటి వరకు స్నేహితులుగా ఉన్న వారు కాస్త ఏదో ఒక విషయంలో గొడవ జరిగి స్నేహితులపైనే దాడులు, కత్తులతో నరికే వరకు వెళ్లిపోతున్నారు. చివరకు కటకటాల పాలు అవుతున్నారు. ఇక వివాహేతర సంబంధాల విషయం చెప్పనక్కర్లేదు. భార్య/ భర్తతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారనే కారణంగా కూడా సదరు వ్యక్తుల ప్రాణాలు తీసేస్తున్నారు. అయితే నేరాలను అదుపు చేసేందుకు పోలీసులు ఎన్నో చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎక్కడో చోట హత్యలు మాత్రం ఆగడం లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే..
జిల్లాలోని శంషాబాద్ మండలం కవేలి గూడ వద్ద ఓ యువకుడుని దుండుగులు అతికిరాతంగా హత్య చేశారు. యువకుడి గొంతు కోసం మరి దారుణంగా చంపేశారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు మొయినాబాద్ మండల్ వెంకటాపూర్ గ్రామానికి చెందిన మహేష్‌గా (26) గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మహేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి తరలించారు. హత్య ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మహిళలు మృతి
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మృతి
Read Latest Telangana News And Telugu News