Karnataka Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మృతి
ABN , Publish Date - Dec 25 , 2025 | 07:10 AM
ఇటీవల రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వింటర్ సీజన్‌లో ఈ ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటకలో పండగపూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బెంగుళూరు నుంచి గోకర్ణకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగాయి. క్షణాల్లో బస్సు పూర్తిగా కాలిపోవడంతో అందులోని 17 మంది సజీవదహనం అయినట్లు సమాచారం.
హిరియుర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో సుమార్ 32 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వాహనదారులిచ్చిన సమాచారంతో పోలీసులు, రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు. క్రిస్మస్ పండగ పూట ఈ విషాదం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
ఇవి కూడా చదవండి..
2 రోజుల్లోనే అలర్జీ వచ్చింది.. ఢిల్లీ వాయి కాలుష్యంపై నితిన్ గడ్కరి కీలక వ్యాఖ్యలు
నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3 ఎం-6