ISRO: నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3 ఎం-6
ABN , Publish Date - Dec 24 , 2025 | 08:55 AM
అంతరిక్ష రంగంలో భారత్ మరో ముందడుగు వేసింది. అమెరికాకు చెందిన ఎల్వీఎం-3 ఎం-6 ఉపగ్రహన్ని తన బాహుబలి రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో.
తిరుపతి, ఇంటర్నెట్ డెస్క్: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) ప్రస్థానంలో మరో మైలురాయి చేరింది. నేటి(బుధవారం) ఉదయం 8:54 గంటలకు ఎల్వీఎం-3 ఎం-6 రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించింది ఇస్రో(LVM-3 M-6). శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్-షార్(SHAR) నుంచి అమెరికా(America)కు చెందిన కొత్త తరం కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూ బర్డ్ బ్లాక్-2ను కక్ష్యలోకి పంపారు(Blue Bird Block-2). 6,400 కిలోల బరువుగల ఈ భారీ ఉపగ్రహాన్ని మోసుకెళ్లే క్రమంలో నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి ఎగిసింది LVM-3 M-6 రాకెట్.
నిర్దేశిత కక్ష్యలో15.07 నిమిషాల్లో రాకెట్ మూడు దశలు పూర్తవగానే లో ఎర్త్ ఆర్బిట్(లియో)లోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది. అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్ మొబైల్(AST Space Mobile) సంస్థతో సంయుక్తంగా ఈ ప్రయోగాన్ని నిర్వహించింది ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్(NSIL). ఈ వాణిజ్య ప్రయోగంతో తన బాహుబలి రాకెట్ ద్వారా ఇస్రో సరికొత్త రికార్డు నెలకొల్పనుంది.
ప్రయోగానికి సంబంధించిన లైవ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవీ చదవండి: