Nitin Gadkari: 2 రోజుల్లోనే అలర్జీ వచ్చింది.. ఢిల్లీ వాయి కాలుష్యంపై నితిన్ గడ్కరి కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 24 , 2025 | 02:39 PM
బయో ఇంధనాల వాడకం ద్వారా స్వయం సమృద్ధి భారత్ దిశగా మనం ముందుకు వెళ్లలేమా అని గడ్కరి ప్రశ్నించారు. తాను 100 శాతం ఇథనాల్‌తో కారును వాడుతున్నానని, ఇది 60 శాతం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తోందని, పొల్యూషన్ అనేదే లేదని చెప్పారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి (Nitin Gadkari) ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు తన శాఖ కూడా ఒక కారణమనే విషయాన్ని అంగీకరిస్తున్నానని అన్నారు. బుధవారంనాడు ఢిల్లీలో మాజీ కేంద్ర సమాచార కమిషనర్ ఉదయ్ మాహూర్‌కర్ రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, భారతదేశం ఏటా రూ.22 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధానాలను (fossil fuels) దిగుమతి చేసుకుంటోందని, ఇది కాలుష్యానికి ఒక కీలక కారణమవుతోందని అన్నారు.
'నేను ఇక్కడ రెండ్రోజులుగా ఉంటున్నాను. దీంతో ఇన్‌పెక్షన్ బారినపడ్డాను. ఢిల్లీ తీవ్ర కాలుష్యం గుప్పిట్లో ఉంది. నేను రవాణా శాఖ మంత్రిగా ఉన్నాను. రవాణా వల్లే 40 శాతం కాలుష్యం వస్తోంది. పెద్దఎత్తున శిలాజ ఇంధనం వాడకమే ఇందుకు కారణమవుతోంది. మనం ప్రత్యామ్నాయ పరిష్కరాలను అభివృద్ధి చేస్తున్నప్పటికీ వాటిని అందిపుచ్చుకునేందుకు ప్రజలు వెనకాడుతున్నారు' అని గడ్కరి అన్నారు.
బయో ఇంధనాల వాడకం ద్వారా స్వయం సమృద్ధి భారత్ దిశగా మనం ముందుకు వెళ్లలేమా అని గడ్కరి ప్రశ్నించారు. తాను 100 శాతం ఇథనాల్‌తో కారును వాడుతున్నానని, ఇది 60 శాతం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తోందని, పొల్యూషన్ అనేదే లేదని చెప్పారు. గతంలోనూ నితిన్ గడ్కరి ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకూ పడిపోతుండటంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎప్పుడు వచ్చినా రెండు మూడు రోజులే ఉంటానని, ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామా అని అనుకుంటానని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
బీఎంసీ ఎన్నికల వేళ చేతులు కలిపిన ఠాక్రే సోదరులు
నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3 ఎం-6
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి