Facial for NEET - JEE: నీట్, జేఈఈ పరీక్షలకు ఇకపై ముఖ గుర్తింపు.!
ABN , Publish Date - Dec 24 , 2025 | 10:09 AM
వచ్చే ఏడాది నుంచి జరిగే ప్రధాన పరీక్షలకు ఇకపై ఫేసియల్ రికగ్నిషన్ తప్పనిసరి కానుంది. నీట్, జేఈఈ వంటి ప్రతిష్ఠాత్మక ప్రవేశ పరీక్షల్లో ముఖ గుర్తింపు విధానాన్ని ప్రవేశపెట్టాలని ఎన్‌టీఏ సిద్ధమైనట్టు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి నిర్వహించే నీట్, జేఈఈ(NEET, JEE) లాంటి ముఖ్యమైన ప్రవేశ పరీక్షలకు ముఖ గుర్తింపు ధృవీకరణ విధానాన్ని(Facial Recognition) అవలంబించేందుకు ప్లాన్ చేస్తోందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ మేరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలోనే లైవ్ ఫొటోగ్రాఫ్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టేందుకు ఏజెన్సీ చర్యలు చేపట్టిందని తెలిపారు(Live Photograph). జేఈఈ మెయిన్స్(JEE Mains), నీట్ యూజీ(NEET UG) సహా ఎన్టీఏ నిర్వహించే అన్ని ప్రధాన పరీక్షలలో ఈ కొత్త వ్యవస్థ అమలుకానున్నట్టు తెలుస్తోంది.
నీటీ యూజీ-2025 సందర్భంగా ఢిల్లీలోని(Delhi) ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాలలో ఆధార్ సంబంధిత ముఖ ప్రామాణీకరణను పరీక్షించడం విజయవంతం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికరారులు తెలిపారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) సహకారంతో ఎన్టీఏ ప్రస్తుత పరీక్షా ప్రొటోకాల్‌తో పాటు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(NIC) అభివృద్ధి చేసిన డిజిటల్ సిస్టమ్‌లతో వీటిని అనుసంధానించినట్టు పేర్కొన్నారు. 2026 నుంచి అన్ని ప్రధాన పరీక్షల్లో ఈ పద్ధతిని ప్రవేశపెట్టనున్నారు.
ఇవీ చదవండి: