Share News

Ram Mohan Naidu: వాజ్‌పేయి గురించి నేటి యువత తెలుసుకోవాలి: రామ్మోహన్ నాయుడు

ABN , Publish Date - Dec 22 , 2025 | 03:44 PM

నేటి యువత వాజ్‌పేయి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. . విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు అని పేర్కొన్నారు.

Ram Mohan Naidu: వాజ్‌పేయి గురించి నేటి యువత తెలుసుకోవాలి: రామ్మోహన్ నాయుడు
Ram Mohan Naidu

పశ్చిమగోదావరి, డిసెంబర్ 22: భీమవరం అంటే పల్లెటూరి ఆప్యాయత ఉన్న పట్టణమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు (Union Minister Rammohan Naidu) అన్నారు. ఈరోజు (సోమవారం) ఉండి బైపాస్ రోడ్డు వద్ద మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని కేంద్రమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. వాజ్‌పేయి విగ్రహ ఆవిష్కరణ తన పూర్వజన్మ సుకృతమన్నారు. ఏ దేశానికి వెళ్ళినా తాము భారతదేశం నుంచి వచ్చామని అంటే సెల్యూట్ చేసే పరిస్థితి ఉందన్నారు. నేటి యువతరం వాజ్‌పేయి గురించి తెలుసుకోవలసిన అవసరం ఉందని తెలిపారు.


ఒక్క ఓటుతో పదవి పోతుంటే ప్రజాస్వామ్యంగా బ్రతకాలని పార్లమెంటులో చెప్పిన వ్యక్తి వాజ్‌పేయి అని అన్నారు. మన హైవేలను నాలుగు లైన్ల స్వర్ణ చుతుర్జుజిగా మార్చిన ప్రధాని వాజ్‌పేయి అని చెప్పుకొచ్చారు. వాజ్‌పేయి నార్త్ ఈస్ట్ అభివృద్ధి చెందాలని మొట్టమొదటగా మినిస్ట్రీ పెట్టారని గుర్తు చేశారు. 25న వాజ్‌పేయి 101 జయంతి సందర్భంగా విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విగ్రహావిష్కరణ చేస్తున్నారని తెలిపారు. ఎన్డీఏ ఎలైన్స్ అంటే పెద్ద పార్టీ అయినా చిన్న పార్టీ అయినా సముచిత స్థానం ఇచ్చిన వ్యక్తి వాజ్‌పేయి అని అన్నారు. గతంలో ఐదు సంవత్సరాలు పళ్ళు వచ్చే విధంగా చెట్టును పెంచితే, చెట్టును నరికేసే కసాయి వచ్చిన పరిస్థితి వచ్చిందని పరోక్షంగా జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.


కాగా.. భీమవరంలో అటల్ - మోదీ సుపరిపాలన బైక్ ర్యాలీ నిర్వహించారు. విస్సాకొడేరు వంతెన వద్ద నుండి ఉండి బైపాస్ రోడ్డు వరకూ బైక్ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్, డిప్యూటీ స్పీకర్ రఘరామకృష్ణరాజు, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

విజయవాడలో మరిన్ని జాతీయ పోటీలకు కృషి: ఎంపీ శివనాథ్

మేం అలా చేస్తే మీరు రోడ్డు మీద తిరుగుతారా?.. వైసీపీకి అనిత స్ట్రాంగ్ కౌంటర్

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 22 , 2025 | 03:51 PM