Share News

Atal - Modi Suparipalana Yatra: ప్రత్యేకంగా అటల్ - మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు సభ

ABN , Publish Date - Dec 25 , 2025 | 12:09 PM

వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఇవాళ సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఈ క్రమంలో అటల్ - మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు సభ గురువారం వెంకటపాలెం వద్ద నిర్వహించారు.

Atal - Modi Suparipalana Yatra: ప్రత్యేకంగా అటల్ - మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు సభ
Atal - Modi Suparipalana Yatra

అమరావతి, డిసెంబరు25 (ఆంధ్రజ్యోతి): వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఇవాళ సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఈ క్రమంలో అటల్ - మోదీ సుపరిపాలన యాత్ర (Atal -Modi Suparipalana Yatra) ముగింపు సభ ఇవాళ(గురువారం) వెంకటపాలెం వద్ద నిర్వహించారు. ఈ సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ ఏపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేశ్, నారాయణ, సత్యకుమార్ యాదవ్, కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు భారీగా హాజరయ్యారు.


వాజ్‌పేయి శత జయంతి సందర్భంగా 12 అడుగుల ఆయన కాంస్య విగ్రహం ఆవిష్కరించారు. అనంతరం వాజ్‌పేయి, భారతమాతల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. వాజ్‌పేయి జీవిత చరిత్రను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు చంద్రబాబు, శివరాజ్ సింగ్ చౌహాన్.


ఈ నేపథ్యంలో ఉమ్మడి ఏపీ అభివృద్ధికి వాజ్‌పేయి సహకారం అందించిన తీరును గుర్తు చేసుకున్నారు సీఎం చంద్రబాబు. అనంతరం ఈ సభలో వందేమాతర గీతం ఆలపించారు. గతంలో తొలగించిన చరణాలను కలిపి పూర్తి వందేమాతర గీతాన్ని ఆలపించారు. వాజ్‌పేయి పేరుతో నిర్మించిన స్మృతి వనానికి సంబంధించిన ఏవీని ప్రదర్శిస్తూ.. వాజ్‌పేయి జీవిత చరిత్రను వివరించారు బీజేపీ నేతలు.


ఈ వార్తలు కూడా చదవండి...

సీఎం చంద్రబాబుతో ఎంపీ కేశినేని కీలక భేటీ.. పలు అంశాలపై చర్చ

క్రిస్మస్ పండుగ.. క్రైస్తవుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 25 , 2025 | 12:21 PM