Share News

Christmas Celebrations: క్రిస్మస్ పండుగ.. క్రైస్తవుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి

ABN , Publish Date - Dec 25 , 2025 | 09:31 AM

క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ క్రైస్తవుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని పేర్కొన్నారు.

Christmas Celebrations: క్రిస్మస్  పండుగ.. క్రైస్తవుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి

అమరావతి, డిసెంబరు25 (ఆంధ్రజ్యోతి): క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు. శాంతిదూత ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా జరుపుకునే క్రిస్మస్ పర్వదినం మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని వ్యాఖ్యానించారు.


క్రీస్తు చూపిన ప్రేమ, క్షమ, సహనం, సేవ వంటి విలువలు ఈనాటి సమాజానికి మరింత అవసరమని పేర్కొన్నారు. క్రైస్తవ మత విశ్వాసాన్ని నిలబెట్టే పాస్టర్లకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని 8,418 మంది క్రైస్తవ పాస్టర్లకు నెలకు రూ.5 వేల చొప్పున గత 12 నెలల గౌరవ వేతనాలను ఒకేసారి ఇస్తూ రూ.51 కోట్లు విడుదల చేశామని గుర్తుచేశారు. క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనే దానికి ఇదే నిదర్శనమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్

క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. క్రైస్తవ ధర్మాన్ని విశ్వసించేవారందరికీ హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఈ పండుగ క్రైస్తవుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


ఏసుక్రీస్తు చెప్పిన ప్రేమ‌, శాంతి, స‌హ‌నం పాటిద్దాం: మంత్రి నారా లోకేశ్

క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభువైన ఏసుక్రీస్తు జన్మించిన పవిత్ర దినమని అన్నారు. క‌రుణామ‌యుడు చూపిన ప్రేమ‌, శాంతి, స‌హ‌నం పాటిద్దామని పేర్కొన్నారు. స‌మాజ‌హితానికి పాటుప‌డదామని.. సుఖ‌సంతోషాల‌తో అంద‌రూ ఆనంద‌మ‌యంగా క్రిస్మస్ పండుగ జ‌రుపుకోవాల‌ని ఏసు ప్రభువును ప్రార్థిస్తున్నానని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి...

ఏసుప్రభువు స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిరూపం: కొల్లు రవీంద్ర

కర్ణాటక బస్సు ప్రమాదం.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 25 , 2025 | 09:56 AM