Christmas Celebrations: ఏసుప్రభువు స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిరూపం: కొల్లు రవీంద్ర
ABN , Publish Date - Dec 25 , 2025 | 08:09 AM
తన మన తారతమ్యాలు, విభేదాలు మరిచి క్రిస్మస్ పండుగను అందరూ సంతోషంగా చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనుల శాఖామంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఏసుప్రభువు చూపిన మార్గం అందరికీ అనుసరణీయమని చెప్పుకొచ్చారు.
కృష్ణ జిల్లా మచిలీపట్నం, డిసెంబరు25 (ఆంధ్రజ్యోతి): ఏసుప్రభువు స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిరూపమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనుల శాఖామంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) వ్యాఖ్యానించారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఇవాళ(గురువారం) మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో అంగరంగ వైభవంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పలువురు క్రైస్తవులు పాల్గొని ప్రత్యేక పార్థనలు చేశారు. ఈ వేడుకలో కొల్లు రవీంద్ర పాల్గొన్నారు.
ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు పుట్టుక జన్మదిన వేడుకలు తెలియజేస్తూ ఏర్పాటు చేసిన మందిరాన్ని సందర్శించారు. మందిరాన్ని ఏర్పాటు చేసిన పిల్లలకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరినీ ప్రేమించాలని, అందరూ బాగుండాలని ఏసుప్రభువు చూపిన మార్గం అందరికీ అనుసరణీయమని చెప్పుకొచ్చారు. తన మన తారతమ్యాలు, విభేదాలు మరిచి క్రిస్మస్ పండుగను అందరూ సంతోషంగా చేసుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
ఏసుక్రీస్తు జీవితం ఆదర్శం: ఎంపీ కేశినేని శివనాథ్

క్రైస్తవ సోదరీ, సోదరీమణులకు తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచ మానవాళికి ఏసుక్రీస్తు జీవితం ఆదర్శమని చెప్పుకొచ్చారు. ఎల్లలులేని సంతోషాలను బహూకరించే ఉత్సవం క్రిస్మస్ అని తెలిపారు. సర్వజనులపై ఏసుక్రీస్తు కరుణాకటాక్షాలు ఉండాలని అన్నారు. లోకరక్షకుడు, కరణామయుడు అయిన క్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ధాన్యం కొనుగోళ్లలో స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ విధానం మేరకు తక్షణ చర్యలు..సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
టీడీపీ మాజీ ఎంపీకి కేంద్రంలో కీలక పదవి
Read Latest AP News And Telugu News