Share News

Kanakamedala Ravindra Kumar: టీడీపీ మాజీ ఎంపీకి కేంద్రంలో కీలక పదవి

ABN , Publish Date - Dec 23 , 2025 | 03:51 PM

తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌‌ని కీలక పదవి వరించింది. సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్‌గా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆయన నియమితులవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Kanakamedala Ravindra Kumar: టీడీపీ మాజీ ఎంపీకి కేంద్రంలో కీలక పదవి
Kanakamedala Ravindra Kumar

ఢిల్లీ, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌కు (Kanakamedala Ravindra Kumar) కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వాన్ని ప్రాతినిధ్యం వహించే అదనపు సొలిసిటర్ జనరల్ (Additional Solicitor General of India – ASGI)గా ఆయనను మోదీ సర్కార్ నియమించింది. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ పదవికి దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన న్యాయపదవుల్లో ఒక్కటిగా గుర్తింపు ఉంది.


కనకమేడల రవీంద్ర కుమార్ నియామకం న్యాయరంగంలో ఆయనకు ఉన్న అనుభవానికి, సామర్థ్యానికి గుర్తింపుగా రాజకీయ, న్యాయ వర్గాలు భావిస్తున్నాయి. రాజకీయ జీవితంతో పాటు న్యాయరంగంలోనూ చురుకైన పాత్ర పోషించిన ఆయనకు ఇప్పుడు దేశస్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించడం ప్రత్యేకంగా నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు సంబంధించిన న్యాయ అంశాలపై కనకమేడల రవీంద్ర కుమార్ కీలక పాత్ర పోషించనున్నారు. రాజ్యాంగపరమైన కీలక వివాదాల్లో ప్రభుత్వ వాదనను ఆయన బలంగా వినిపిస్తారని కేంద్రం భావిస్తోంది.


కనకమేడల రవీంద్ర కుమార్‌కు ఈ పదవి వరించడంతో తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఆనందం వెల్లివిరిసింది. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అనుభవజ్ఞుడైన న్యాయవాదికి ఈ పదవి రావడం సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వ వాదనకు బలం చేకూరుస్తోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


కనకమేడల రవీంద్ర కుమార్‌ను అదనపు సొలిసిటర్ జనరల్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా నిలుస్తోందని టీడీపీ నేతలు ప్రశంసిస్తున్నారు. మూడేళ్ల పాటు సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వ తరఫున సేవలందించనున్న ఆయనకు ఈ పదవి న్యాయరంగంలో ఉన్న ప్రతిభకు లభించిన గొప్ప గుర్తింపుగా భావిస్తున్నారు. కనకమేడల రవీంద్ర కుమార్ నియామకంతో రాజకీయ, న్యాయవర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.


ఇవి కూడా చదవండి...

వరుస బాంబు బెదిరింపులు.. పోలీసులు సీరియస్.. ఏం చేయనున్నారంటే?

ఏపీలో మళ్లీ అదే సక్సెస్ ఫార్ములా.. క్వాంటం, ఏఐపై సీబీఎన్ ప్లాన్ ఇదే

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 23 , 2025 | 04:38 PM