Share News

Shamshabad Airport: వరుస బాంబు బెదిరింపులు.. పోలీసులు సీరియస్.. ఏం చేయనున్నారంటే?

ABN , Publish Date - Dec 23 , 2025 | 09:21 AM

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో బాంబు ఉన్నట్లు మరోసారి మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది విమానాశ్రయంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తరచూ బాంబు మెయిల్స్‌పై పోలీసులు సీరియస్ అయ్యారు.

Shamshabad Airport: వరుస బాంబు బెదిరింపులు.. పోలీసులు సీరియస్.. ఏం చేయనున్నారంటే?
Shamshabad Airport

హైదరాబాద్, డిసెంబర్ 23: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (శంషాబాద్ ఎయిర్‌పోర్టు) (Shamshabad Airport) తరచుగా బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం.. ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది తనిఖీలు చేయడం... చివరకు అది ఫేక్ బెదిరింపు అని తేలడం పరిపాటిగా మారిపోయింది. రోజు విడిచి రోజు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో భద్రతా సిబ్బంది కూడా ఎంతో అలర్ట్‌గా ఉండి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అయితే వరుస బాంబు బెదిరింపులతో విమానాశ్రయంలోని ప్రయాణికులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఇప్పుడు తాజాగా మరోసారి విమానాశ్రయంలో బాంబు ఉన్నట్లు ఓ మెయిల్ వచ్చింది. వివరాల్లోకి వెళితే...


శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మరోసారి బాంబ్ బెదిరింపుల ఈమెయిల్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. తరచుగా వస్తున్న ఫేక్ బాంబ్ బెదిరింపు మెయిల్స్‌పై పోలీసులు సీరియస్ అయ్యారు. ఈ ఏడాది ఒక్క శంషాబాద్ ఎయిర్‌పోర్టుకే దాదాపు 28 సార్లు బాంబు బెదిరింపులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమై అన్ని చెకింగ్స్ చేశాకా అది ఫేక్ మెయిల్స్‌గా భద్రత సిబ్బంది నిర్ధారించారు. ఇప్పటికే బాంబ్ బెదిరింపులపై ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్‌లో 28 కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులపై లోతుగా దర్యాప్తు చేసేందుకు పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. వీటిని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేయాలని ఆర్జీఐఏ పోలీసులు యోచిన్నట్లు తెలుస్తోంది.


డార్క్ వెబ్ ఉపయోగించి మరీ కేటుగాళ్లు ఈ ఫేక్ మెయిల్స్ పంపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫేక్ బాంబ్ బెదిరింపుల కేసులు బదిలీ చేయాలని ఎయిర్‌పోర్టు పోలీసులు భావిస్తున్నారు. ఏది ఏమైనా పదే పదే విమానాశ్రయంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు మెయిల్స్ రావడంపై ప్రయాణికులు తీవ్ర అసహనం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి మెయిల్స్ పంపిస్తున్న వారిని వెంటనే పట్టుకుని తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

సికింద్రాబాద్‌-వేలాంకణి మధ్య రెండు క్రిస్‌మస్‌ ప్రత్యేక రైళ్లు

ఆ ఏరియాల్లో 10 గంటల నుంచి కరెంట్ కట్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 23 , 2025 | 10:19 AM