Share News

Electricity: ఆ ఏరియాల్లో 10 గంటల నుంచి కరెంట్ కట్..

ABN , Publish Date - Dec 23 , 2025 | 06:45 AM

హైదరాబాద్ మహాపగరంలోని ఆయా ఏరియాల్లో మంగళవారం విద్యుత్ సరఫరా ఉండదని సంబంధిత అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.

Electricity: ఆ ఏరియాల్లో 10 గంటల నుంచి కరెంట్ కట్..

  • నగరంలో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలివే..

పంజాగుట్ట(హైదరాబాద్): మరమ్మతుల కారణంగా మంగళవారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నామని బంజారాహిల్స్‌ ఏడీఈ జి. గోపి(Banjara Hills ADE G. Gopi) తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఏజీ కాలనీ, బంజారాహిల్స్‌ ఫీడర్ల పరిధిలో, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వెంగళరావునగర్‌, ఈ-సేవ పీఢర్ల పరిధిల్లోని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని ఏడీఈ పేర్కొన్నారు.


city1.jpg

చికోటి గార్డెన్స్‌, ఫతేనగర్‌ ఫీడర్ల పరిధిలో...

ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు చికోటి గార్డెన్స్‌, ఫతేనగర్‌ ఫీడర్ల పరిధిలో, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు హిందూ, అల్లావుద్దీన్‌ కోఠి, మోతీలాల్‌నగర్‌ ఫీడర్ల పరిధుల్లోని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని గ్రీన్‌ల్యాండ్స్‌ ఏడీఈ ఎల్‌.వి. సత్యనారాయణ(Greenlands ADE L.V. Satyanarayana) పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇచ్చంపల్లి నుంచి తరలిస్తే మహారాష్ట్రకు ముంపు!

ఈశాన్య రుతుపవనాలు బలహీనం

Read Latest Telangana News and National News

Updated Date - Dec 23 , 2025 | 06:45 AM