Share News

CM Chandrababu: ఏపీలో మళ్లీ అదే సక్సెస్ ఫార్ములా.. క్వాంటం, ఏఐపై సీబీఎన్ ప్లాన్ ఇదే

ABN , Publish Date - Dec 23 , 2025 | 10:56 AM

రాష్ట్రవ్యాప్తంగా టెక్ స్టూడెంట్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద ఎత్తున క్వాంటం టాక్ నిర్వహించారు. చంద్రబాబు నిర్వహించిన క్వాంటం టాక్ కార్యక్రమంలో టెక్ స్టూడెంట్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు.

CM Chandrababu:  ఏపీలో మళ్లీ అదే సక్సెస్ ఫార్ములా.. క్వాంటం, ఏఐపై సీబీఎన్ ప్లాన్ ఇదే
CM Chandrababu

అమరావతి, డిసెంబర్ 23: సక్సెస్ అయిన ఫార్మూలానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) మళ్లీ తెరపైకి తీసుకువచ్చారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఐటీని ప్రమోట్ చేస్తూ ఎలాంటి ప్రణాళికలు రచించారో... ఇప్పుడు క్వాంటం, ఏఐను ప్రమోట్ చేయడానికి అదే స్ట్రాటజీని అవలంభిస్తున్నారు సీఎం. అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాలు, జాతీయ స్థాయిలో తీసుకున్న పాలసీలను అందిపుచ్చుకునేలా ఏపీ యువతను ముఖ్యమంత్రి సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఐటీ కంపెనీలకు అవసరమైన నిపుణులను, ఉద్యోగులను అందించేందుకు పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలను చంద్రబాబు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు విభజిత ఏపీలో క్వాంటం, ఏఐ, డీప్ టెక్ కంపెనీలకు అవసరమైన నైపుణ్యం ఉన్న హ్యూమన్ రిసోర్సెస్‌ను బిల్డప్ చేస్తున్నారు సీబీఎన్.


ఓవైపు క్వాంటం, ఏఐ, డీప్ టెక్ కంపెనీలను రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానిస్తూనే... మరోవైపు ఏఐ, క్వాంటం నిపుణులుగా యువతను సిద్ధం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఏపీ నుంచి 50 వేల మంది ఏఐ, క్వాంటం నిపుణలను తీర్చిదిద్దేలా సీఎం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విశాఖను ఏఐ హబ్, అమరావతిని క్వాంటం వ్యాలీగా రూపొందించేందుకు కసరత్తు ముమ్మరం చేశారు. హైదరాబాద్ డెవలప్‌మెంట్‌ కోసం ఉమ్మడి రాష్ట్రంలో తాను అనుసరించిన పాలసీనే ఏపీ డెవలప్‌మెంట్ కోసం సీబీఎన్ మళ్లీ అమలు చేస్తున్న పరిస్థితి. రాష్ట్రంలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏఐ, క్వాంటం నిపుణులను అందించేలా ఏపీలో ఎకో సిస్టంను చంద్రబాబు తయారు చేస్తున్నారు. మరికొన్ని నెలల్లో ఏపీకి క్వాంటం కంప్యూటింగ్ మెషిన్ రానుంది. మరో ఎడెనిమిది నెలల్లో క్వాంటం వ్యాలీలో క్వాంటం టవర్లు సిద్ధం కానున్నాయి.


ఈ ప్రణాళికల్లో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా టెక్ స్టూడెంట్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద ఎత్తున క్వాంటం టాక్ నిర్వహించారు. చంద్రబాబు నిర్వహించిన క్వాంటం టాక్ కార్యక్రమంలో టెక్ స్టూడెంట్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ అభిప్రాయాలను, ఆలోచనలను సీఎం చంద్రబాబుతో పంచుకున్నారు. క్వాంటం, ఏఐ రంగాలను ఏపీలో ఎలా అభివృద్ధి చేయాలనే అంశంపై విద్యార్థులకు సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పాలసీలు, అభివృద్ధి కార్యక్రమాలను అందిపుచ్చుకునేలా విద్యార్థులు, యువత ఆలోచన చేయాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సూచించారు.


ఇవి కూడా చదవండి...

ఆ ఏరియాల్లో 10 గంటల నుంచి కరెంట్ కట్..

వరుస బాంబు బెదిరింపులు.. పోలీసులు సీరియస్.. ఏం చేయనున్నారంటే?

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 23 , 2025 | 11:13 AM