దొరసానిపాడులో వైసీపీ బ్యాచ్ వీరంగం.. బైక్‌పై పెట్రోల్ పోసి
ABN, Publish Date - Dec 23 , 2025 | 10:36 AM
దొరసానిపాడులో బైక్‌కు సైలెన్సర్లు తీసివేసి స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు వైసీపీ శ్రేణులు. పోలీసులు బైక్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా దౌర్జన్యానికి దిగారు.
ఏలూరు, డిసెంబర్ 23: జిల్లాలోని దొరసానిపాడులో మాజీ హోంమంత్రి తానేటి వనిత అనుచరుల వీరంగంపై కేసు నమోదు అయ్యింది. మాజీ సీఎం జగన్ (Former CM Jagan) పుట్టినరోజు నాడు వైసీపీ శ్రేణులు శాంతిభద్రతలకు కలిగించారు. దొరసానిపాడులో బైక్‌కు సైలెన్సర్లు తీసివేసి స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. పోలీసులు బైక్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా దౌర్జన్యానికి దిగారు. బైక్ సీజ్ చేస్తే పెట్రోల్ పోసి నిప్పంటిస్తామని దొరసానిపాడు సర్పంచ్ సిద్ధిరాజు, అతని అనుచరులు బెదిరించారు. ఇక పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోకుండా బైక్‌ను తగలబెట్టేందుకు యత్నించారు.
అడ్డుకున్న పోలీసులను పక్కకు నెట్టేసి వారి కాలర్ పట్టుకుని మరీ దాడికి తెగబడ్డారు. దీంతో సర్పంచ్ సిద్ధిరాజుతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి...
ఆ ఏరియాల్లో 10 గంటల నుంచి కరెంట్ కట్..
వరుస బాంబు బెదిరింపులు.. పోలీసులు సీరియస్.. ఏం చేయనున్నారంటే?
Read Latest AP News And Telugu News
Updated at - Dec 23 , 2025 | 10:38 AM