AP Ministers: కర్ణాటక బస్సు ప్రమాదం.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు
ABN , Publish Date - Dec 25 , 2025 | 08:42 AM
కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఇవాళ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు వెంటనే కోరుకోవాలని ఆకాంక్షించారు. వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
అమరావతి, డిసెంబరు25 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో ఇవాళ(గురువారం) ఘోర బస్సు ప్రమాదం (Karnataka, Bus Accident) జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొన్నడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో 17 మంది సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి. ట్రావెల్స్ బస్సు బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి: మంత్రి సత్యకుమార్ యాదవ్
కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఇవాళ జరిగన ఘోర రోడ్డు ప్రమాదంపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Minister Satya Kumar Yadav) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సులో మంటలు చెలరేగి 17 మంది సజీవ దహనంపై విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అవసరమైన సహాయం అందించేందుకు సరిహద్దు ఆస్పత్రుల సిబ్బంది సిద్ధంగా ఉండాలని అనంతపురం జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం సహాయం అందించాలని మంత్రి సత్యకుమార్ సూచించారు.
ఈ ఘటన చాలా బాధాకరం: మంత్రి అచ్చెన్నాయుడు

కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 17 మంది సజీవదహనం కావడం బాధాకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు మంత్రి అచ్చెన్నాయుడు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ ఘటనపై అధికారులు వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.
ఇవి కూడా చదవండి...
ఏసుప్రభువు స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిరూపం: కొల్లు రవీంద్ర
టీడీపీ మాజీ ఎంపీకి కేంద్రంలో కీలక పదవి
Read Latest AP News And Telugu News
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి రూ.2 లక్షలు, గాయపడ్డ వారికి రూ.50,000లు ప్రకటించారు. ఈ మొత్తాన్ని ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి అందజేయనున్నారు. మృతదేహాలను గుర్తించడానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ విషాద ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పందిస్తూ.. బాధితులకు అవసరమైన అన్ని వైద్య సహాయాలు అందించాలని అధికారులను ఆదేశించారు.