Kesineni Sivnath Meet Chandrababu: సీఎం చంద్రబాబుతో ఎంపీ కేశినేని కీలక భేటీ.. పలు అంశాలపై చర్చ
ABN , Publish Date - Dec 25 , 2025 | 09:31 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గురువారం కలిశారు. ఈ సందర్భంగా సీఎంతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.
విజయవాడ, డిసెంబరు25 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును (CM Chandrababu Naidu) విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (MP Kesineni Sivnath), ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇవాళ(గురువారం) కలిశారు. ఈ సందర్భంగా సీఎంతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు.
విజయవాడ నగర పరిసరాల్లోని 74 గ్రామాల విలీనంతో గ్రేటర్ విజయవాడ ఏర్పాటు ప్రతిపాదన ఉందని ప్రస్తావించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న గ్రేటర్ విజయవాడ ఏర్పాటుపై సత్వరమే చర్యలు తీసుకోవాలని ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు. ఎంపీ శివనాథ్ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించారు సీఎం చంద్రబాబు. గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌పై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఏసుప్రభువు స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిరూపం: కొల్లు రవీంద్ర
కర్ణాటక బస్సు ప్రమాదం.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు
Read Latest AP News And Telugu News