Share News

Kishan Reddy: వాజ్‌పేయి ప్రసంగాలు, వ్యక్తిత్వం యువతకు మార్గదర్శకాలు: కిషన్ రెడ్డి

ABN , Publish Date - Dec 25 , 2025 | 03:27 PM

ఒక్క ఓటు తేడా ఉంటే నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేసి ప్రధాని పదవిని తృణ ప్రాయంగా వదులుకున్న మహోన్నతమైన నేత అటల్ జీ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భారతదేశ రక్షణ కోసం ఎంతో కృషి చేసి సుపరిపాలన అందించిన నేత అని తెలిపారు.

Kishan Reddy: వాజ్‌పేయి ప్రసంగాలు, వ్యక్తిత్వం యువతకు మార్గదర్శకాలు: కిషన్ రెడ్డి
Kishan Reddy

హైదరాబాద్, డిసెంబర్ 25: అటల్ జీ 101వ జన్మదినం సందర్బంగా దేశమంతా ఉత్సవాలు కార్యక్రమాలు జరుపుకుంటున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ప్రధాని , భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు కేంద్రమంత్రి. అనంతరం మాట్లాడుతూ.. అటల్ బిహారీ వాజ్‌పేయి మంచి వక్త, మంచి పరిపాలనా దక్షుడు, విలువలు కలిగిన మహా నేత అని కొనియాడారు.


ఒక్క ఓటు తేడా ఉంటే నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేసి ప్రధాని పదవిని తృణ ప్రాయంగా వదులుకున్న మహోన్నతమైన నేత అటల్ జీ అని అన్నారు. భారతదేశ రక్షణ కోసం ఎంతో కృషి చేసి సుపరిపాలన అందించిన నేత అని తెలిపారు. సర్వ శిక్ష అభియాన్ పేరుతో విద్యాలయాల్లో మౌళిక వసతులు ఏర్పాటు చేశారని చెప్పారు.. పేద ప్రజల పక్షాన నిలిచి వారి అభ్యుదయం కోసం అనేక సంస్కరణలు తీసుకోచ్చిన నేత అటల్ అని అన్నారు. ఆయన ప్రసంగాలు, వ్యక్తిత్వం దేశ యువతకు మార్గదర్శిగా నిలిచాయన్నారు.


పాకిస్థాన్ వెన్నుపోటు పొడిస్తే తిరిగి పాక్‌కు మూడు చెరువుల నీళ్ళు తాగించి పాక్‌ను మట్టికరిపించిన ఘనత అటల్‌కు దక్కుతుందని చెప్పుకొచ్చారు. ఒక దేశం నుండి మరొక దేశానికి.. ఢిల్లీ నుంచి లాహోర్‌కు బస్‌లో వెళ్లిన మొదటి ప్రధాని మోదీ అని తెలిపారు. స్వర్ణ చతుర్భుజి పేరుతో దేశ వ్యాప్తంగా రోడ్ల విస్తరణ చేసిన ఘనత ఆయనది అని అన్నారు. దేశ ప్రగతిలో తనదైన ముద్ర వేసుకున్న మహానుభావుడన్నారు. దేశ యువతకు అటల్ జీ జీవితం ఒక స్పూర్తి అనితెలిపారు. నేడు వాజ్‌పేయికు యావత్ దేశం ఘనంగా నివాళి అర్పిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం..

సింపతీ పెంచే కుట్ర.. సీఎం రేవంత్‌పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 25 , 2025 | 03:36 PM