Bus Accident: కాలేజీ బస్సు బోల్తా.. విద్యార్థులకు గాయాలు
ABN , Publish Date - Dec 25 , 2025 | 12:37 PM
విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు.
మహబూబ్‌నగర్, డిసెంబర్ 25: జడ్చర్ల సమీపంలోని బాలానగర్ మండల పరిధిలో జాతీయ రహదారి 44పై జియో పెట్రోల్ బంక్ వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఓ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. గాయపడిన విద్యార్థులకు బాలానగర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. గాయపడిన వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. మక్తల్ నుంచి హైదరాబాద్‌కు విద్యార్థులతో వెళ్తున్న మణికంఠ కాలేజీ బస్సు ఈ ప్రమాదానికి గురైందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పేర్కొన్నారు.
మరోవైపు.. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ సమీపంలో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. హైదరాబాద్ జలవిహార్‌కు విహారయాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ బస్సు ప్రమాదంతో శంషాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు రంగంలోకి దిగి.. ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.
ఇంకోవైపు కర్ణాటకలో బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కంటైనర్ ఢీకొట్టింది. ఓ లారీ.. డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టడంతో.. మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దాదాపు 17 మంది సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం.. ఆదివారం ఉదయం 2.30 గంటల సమయంలో చోటు చేసుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
మళ్లీ బాంబు బెదిరింపు.. విమానం అత్యవసర ల్యాండింగ్..
For More TG News And Telugu News