Shamshabad Airport: మళ్లీ బాంబు బెదిరింపు.. విమానం అత్యవసర ల్యాండింగ్..
ABN , Publish Date - Dec 25 , 2025 | 09:32 AM
హైదరాబాద్ నుంచి కొలంబో వెళ్తున్న విమానంలో మహిళ ప్రయాణికురాలు గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను శంషాబాద్ ఎయిర్ పోర్టులోని ఆసుపత్రికి తరలించారు.
శంషాబాద్, డిసెంబర్ 25: సౌదీ అరేబియా విమానయాన సంస్థకు చెందిన ఫ్లైనాస్ విమానంలో ఐదు ఆర్డీఎక్స్ బాంబులు అమర్చినట్లు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు గురువారం బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. దీంతో ఎయిర్ పోర్టులో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు ఎయిర్ పోర్ట్ అధికారులు. అనంతరం ప్రయాణికులను విమానం నుంచి అత్యవసరంగా దింపి వేసి.. ఆ తర్వాత బాంబ్ స్క్వాడ్ సిబ్బంది ముమ్మర తనిఖీలు చేపట్టారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు ఇటీవల వరుస బాంబు బెదిరింపు మెయిల్స్, ఫోన్ కాల్స్ వస్తునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్టు అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. ఈ తరహా బెదిరింపు కాల్స్, మెయిల్స్‌పై అధికారులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో మహిళకు అస్వస్థత..
మరో ఘటనలో భాగంగా.. హైదరాబాద్ నుంచి కొలంబో వెళ్తున్న విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలు గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను శంషాబాద్ ఎయిర్ పోర్టులోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం విమానం కొలంబో బయలుదేరి వెళ్లింది.
ఇదిలా ఉండగా.. హైదరాబాద్ - వారణాసి మధ్య నడిచే ఎయిర్ ఇండియా విమానాన్ని రద్దు చేసినట్లు ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మాజీ ప్రధాని వాజ్‌పేయ్ జన్మదిన వేడుకలు.. హాజరుకానున్న ప్రముఖలు
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..
For More TG News And Telugu News