Ex PM Vajpayee: మాజీ ప్రధాని వాజ్‌పేయ్ జన్మదిన వేడుకలు.. హాజరుకానున్న ప్రముఖులు
ABN , Publish Date - Dec 25 , 2025 | 08:18 AM
తెలగు రాష్ట్రాల్లో భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ జయంతి వేడుకలు నేడు ఘనం నిర్వహించనున్నారు. అందుకోసం బీజేపీ శ్రేణులు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
హైదరాబాద్/ అమరావతి, డిసెంబర్ 25: తెలగు రాష్ట్రాల్లో భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ జయంతి వేడుకలను నేడు ఘనం నిర్వహించనున్నారు. సికింద్రాబాద్‌లో వాజ్‌పేయ్ 101 జయంతి వేడుకలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు హాజరుకానున్నారు. ఇక రాజధాని అమరావతిలో 14 అడుగుల వాజ్‌పేయ్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి సీఎం చంద్రబాబు ఆవిష్కరించనున్నారు.
వాజ్‌పేయ్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా రాజధాని అమరావతిలో వెంకటపాలెంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ ఏర్పాటు పనులను ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పరిశీలించారు. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న తొలి విగ్రహం వాజ్‌పేయ్‌దే కావడం గమనార్హం.
మరోవైపు అటల్ బిహారీ వాజ్‌పేయ్ శత జయంతి వేడుకలు పురస్కరించుకుని బీజేపీ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. అటల్ సందేశ్.. మోదీ సుపరిపాలన యాత్రను ఆ పార్టీ చేపట్టింది. డిసెంబర్ 11న ఈ యాత్ర ప్రారంభమైంది. ఇది ఈ రోజుతో అంటే డిసెంబర్ 25వ తేదీతో ముగియనుంది. ఈ యాత్రలో భాగంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో వాజ్‌పేయ్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ప్రధానిగా దేశానికి వాజ్‌పేయ్ చేసిన సేవలను ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు ప్రశంసించారు.