Vallabhaneni Vamsi Mohan: వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. పోలీసుల అదుపులో ప్రధాన అనుచరుడు
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:34 AM
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీమోహన్‌కు బిగ్ షాక్ తగిలింది. వంశీ ప్రధాన అనుచరుడు కొమ్మా కోట్లును విజయవాడ పటమట పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు.
విజయవాడ, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీమోహన్‌కు (Vallabhaneni Vamsi Mohan) బిగ్ షాక్ తగిలింది. వంశీ ప్రధాన అనుచరుడు కొమ్మా కోట్లును విజయవాడ పటమట పోలీసులు ఇవాళ(సోమవారం) అదుపులోకి తీసుకున్నారు. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో ఏ2గా ఉన్నారు కొమ్మా కోట్లు.గత కొంతకాలంగా ఆయన అజ్ఞాతంలో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు కొమ్మా కోట్లును పటమట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, కొమ్మా కోట్లును ఇవాళ అరెస్ట్ చేసినట్లు చూపనున్నారు పోలీసులు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం కోర్టుకు పోలీసులు తీసుకువచ్చారు. న్యాయాధికారి ముందు కొమ్మా కోట్లును హాజరు పరిచారు పోలీసులు. ఈ సందర్భంగా కొమ్మా కోట్లు మీడియాతో మాట్లాడారు.
నేను ఏ తప్పూ చేయలేదు:కొమ్మల కోట్లు
సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో తన ప్రమేయం ఏమీ లేదని కొమ్మా కోట్లు స్పష్టం చేశారు. తాను ఏ తప్పూ చేయలేదని, తన మీద పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పుకొచ్చారు. అందువల్లే ఈరోజు పటమట పోలీస్టేషన్‌కు వచ్చి తాను లొంగిపోయానని తెలిపారు. కోర్టులో తనకు న్యాయం జరగుతుందనే నమ్మకం ఉందని కొమ్మా కోట్లు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం: పవన్ కల్యాణ్
గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలి
Read Latest AP News and National News