Home » Gannavaram
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో మర్యాద పూర్వకంగా సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఏపీ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.
గన్నవరంలో భారీగా గంజయి పట్టుబడింది. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీమోహన్‌కు బిగ్ షాక్ తగిలింది. వంశీ ప్రధాన అనుచరుడు కొమ్మా కోట్లును విజయవాడ పటమట పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు.
గన్నవరం విమానాశ్రయంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఈ విమానం హుబ్లీ నుంచి తెలంగాణలోని హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. అయితే హైదరాబాద్ లో వాతావరణం అనుకూలించకపోవడంతో గన్నవరం విమానాశ్రయంలో ఇండిగో ఫ్లైట్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
గన్నవరం నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణ కోసం ఓ కమిటీని కూటమి ప్రభుత్వం నియమించింది. బాపులపాడు, ఉంగుటూరు, గన్నవరం మండలాల్లోని చెరువులు, వాగులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై పూర్తిస్ధాయి విచారణను చేపట్టాలని నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం.
రన్ వేపై టేకాఫ్ అవుతున్న సమయంలో ఎదురుగా వచ్చిన ఓ పక్షి బలంగా విమానాన్ని ఢీ కొట్టింది. పక్షి ఢీకొనటంతో పైలట్ సడన్ ఎయిర్ బ్రేక్ వేశాడు. ఆ వెంటనే విమానాన్ని వెనక్కు తీసుకువచ్చాడు.
బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లాల్సిన ఇండిగో విమానం వాతావరణం అనుకూలించక విజయవాడ(గన్నవరం) విమానాశ్రయంలో దిగింది.
CM Chandrababu Helicopter: వాతావరణం సరిగ్గా అనుకూలించకపోవడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ను గన్నవరంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీంతో సీఎం ప్రత్యేక విమానంలో రాజమండ్రికి బయలుదేరి వెళ్లారు.
Vallabhaneni Vamsi: నకిలీ ఇళ్లపట్టాల పంపిణీ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కాగా టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది. అదనంగా, అక్రమ మైనింగ్ కేసులో ఆయనపై రూ. 192 కోట్ల అక్రమ లాభాల ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మరో కేసు నమోదు అయింది.
PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏపీకి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రులు స్వాగతం పలికారు.