CM Chandrababu: నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఎందుకంటే..
ABN , Publish Date - Dec 28 , 2025 | 09:14 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో మర్యాద పూర్వకంగా సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఏపీ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.
గన్నవరం, డిసెంబరు28 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఇవాళ(ఆదివారం) గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో (Nirmala Sitharaman) మర్యాద పూర్వకంగా సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఏపీ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ రోజు నిర్మలా సీతారామన్ ఏపీలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతకుముందు పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
రామ్మోహన్ రావు కుటుంబ సభ్యులకు సీఎం పరామర్శ
మరోవైపు.. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరానికి సీఎం చంద్రబాబు ఆదివారం వెళ్లిన విషయం తెలిసిందే. అయోధ్య బాల రాముడును దర్శించుకున్న అనంతరం గన్నవరం విమానాశ్రయానికి సీఎం వచ్చారు. అక్కడి నుంచి కృష్ణా జిల్లాలోని ఉంగుటూరు మండలం పెద్ద ఆవుటపల్లి గ్రామానికి సీఎం చంద్రబాబు బయలుదేరారు. తన పర్యటనలో భాగంగా మాజీ రాజ్యసభ సభ్యులు కంభంపాటి రామ్మోహన్ రావు నివాసానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో రామ్మోహన్ రావు కుటుంబ సభ్యులను సీఎం చంద్రబాబు పరామర్శించారు.
ఇవి కూడా చదవండి...
వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలోకి కీలక నేతలు
ఈ ఏడాది ప్రత్యేకంగా ముక్కోటి ఏకాదశి
Read Latest AP News And Telugu News