Share News

IndiGo Flight Emergency Landing: గన్నవరంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

ABN , Publish Date - Nov 04 , 2025 | 07:56 PM

గన్నవరం విమానాశ్రయంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఈ విమానం హుబ్లీ నుంచి తెలంగాణలోని హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. అయితే హైదరాబాద్ లో వాతావరణం అనుకూలించకపోవడంతో గన్నవరం విమానాశ్రయంలో ఇండిగో ఫ్లైట్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

IndiGo Flight Emergency Landing: గన్నవరంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
IndiGo Flight

విజయవాడ, నవంబర్ 4: గన్నవరం విమానాశ్రయం (Gannavaram Airport)లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ (IndiGo Flight Emergency Landing) అయ్యింది. ఈ విమానం హుబ్లీ నుంచి తెలంగాణలోని హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. అయితే హైదరాబాద్ లో వాతావరణం అనుకూలించకపోవడంతో ఇవాళ(మంగళవారం) గన్నవరం విమానాశ్రయంలో ఇండిగో ఫ్లైట్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.


గత రెండు రోజులుగా హైదరాబాద్(Hyderabad)లో వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం (Rain In Hyderabad) కురిసింది. అలానే ఇవాళ(మంగళవారం) కూడా హైదరాబాద్ లో నల్లటి మేఘాలు అలుముకున్నాయి. అంతేకాక పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. ఇలా వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఇండిగో విమానాన్ని విజయవాడ (Vijayawada) గన్నవరం ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

రహదారుల నాణ్యతలో రాజీపడబోం.. అధికారులకి పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్‌ ప్రజాదర్బార్‌

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 04 , 2025 | 08:21 PM