Share News

Rammohan: భోగాపురంలో ఏవియేషన్ యూనివర్సిటీ.. కేంద్రమంత్రి రామ్మోహన్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Nov 04 , 2025 | 06:56 PM

ఏపీ అభివృద్ధికి కేంద్రంగా భోగాపురం విమానాశ్రయం నిలుస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణం 91.7 శాతం పూర్తి అయిందని పేర్కొన్నారు.

Rammohan: భోగాపురంలో ఏవియేషన్ యూనివర్సిటీ.. కేంద్రమంత్రి రామ్మోహన్ కీలక వ్యాఖ్యలు
Rammohan Naidu On Bhogapuram Airport

విజయనగరం, నవంబరు4 (ఆంధ్రజ్యోతి): ఏపీ అభివృద్ధికి కేంద్రంగా భోగాపురం విమానాశ్రయం (Bhogapuram Airport) నిలుస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు (Union Minister Rammohan Naidu) వ్యాఖ్యానించారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణం 91.7 శాతం పూర్తి అయిందని పేర్కొన్నారు. ఇవాళ (మంగళవారం) భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ పనులని రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే నాగమాధవి పరిశీలించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడారు.


ఉత్తరాంధ్రా సంస్కృతికి ప్రతిబింబంగా భోగాపురం విమానాశ్రయ నిర్మాణాన్ని తీర్చిదిద్దుతున్నామని చెప్పుకొచ్చారు. వచ్చే నెలలో భోగాపురం విమానాశ్రయం నుంచి ట్రైయల్ రన్ నిర్వహిస్తామని తెలిపారు. భోగాపురంలో ఏవియేషన్ యూనివర్సిటీ నిర్మాణానికి రూపకల్పన చేస్తున్నామని పేర్కొన్నారు. శ్రీకాకుళం, భోగాపురంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. విశాఖపట్నంలో వచ్చే నెలలో జరుగనున్న అంతర్జాతీయ సమ్మిట్‌లో భోగాపురం విమానాశ్రయ పరిసరాల్లో పలు పరిశ్రమల స్థాపనకు తగిన నివేదిక అందజేస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

రహదారుల నాణ్యతలో రాజీపడబోం.. అధికారులకి పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్‌ ప్రజాదర్బార్‌

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 04 , 2025 | 08:05 PM