Home » Ram Mohan
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో.. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఢిల్లీలోని పౌర విమానయాన శాఖ కార్యాలయం రాజీవ్ గాంధీ భవన్‌లో బుధవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.
ఫుకెట్ - ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఈ ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు జరుపుతోందని పేర్కొన్నారు.
‘‘వెల్‌కమ్ టు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు’’ అంటూ వచ్చిన ప్రకటన ప్రయాణికులకు ప్రత్యేకమైన మధురానుభూతి కలిగించింది. ఉత్తరాంధ్ర ప్రగతికి కీలకమైన ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
భోగాపురం విమానాశ్రయంలో ఈ రోజు నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ప్రయాణికులు చాలా ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు.
విమాన ప్రయాణికులను దోపిడీ చేసే స్థాయిలో ధరలు పెరిగితే కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని చర్యలు తీసుకుంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ప్రయాణికులపై భారం పడనివ్వబోమని పేర్కొన్నారు.
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దర్యాప్తు తుది దశకు చేరిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
ఉడాన్ పథకాన్ని మరో పదేళ్లు పొడిగిస్తున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. రూ.30 వేల కోట్లతో 100 కొత్త ఎయిర్‌పోర్టులు, 200 హెలిపోర్టులే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.
వరంగల్ విమానాశ్రయం ఆకృతిలో కాకతీయ సంస్కృతికి పెద్ద పీట వేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసిందే. వారి భౌతికకాయాలను వీలైనంత త్వరగా స్వస్థలాలకు చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అండ్ కోకి లోకేశ్ అంటే భయమని, అందుకే ఆయనను టార్గెట్‌గా చేసుకుని ఫేక్ ప్రచారాలు చేస్తోందని ధ్వజమెత్తారు.