Rammohan Naidu: రామ్మోహన్‌కు బర్త్ డే విషెస్ తెలిపిన ప్రధాని, సీఎం
ABN , Publish Date - Dec 18 , 2025 | 01:39 PM
కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు.
అమరావతి, డిసెంబరు18 (ఆంధ్రజ్యోతి): కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. రామ్మోహన్ ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. విమానయాన రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తీరు చాలా బాగుందని వారు ప్రశంసించారు.
రామ్మోహన్ విస్తృతంగా కృషి చేస్తున్నారు: ప్రధాని మోదీ
కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పౌర విమానయాన రంగాన్ని సంస్కరించడానికి విస్తృతంగా కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రామ్మోహన్ దీర్ఘాయుష్షుతో నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
రామ్మోహన్‌కు సీఎం చంద్రబాబు బర్త్ డే విషెస్..
కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రామ్మోహన్‌కు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ఉండాలని కోరుకుంటున్నానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
రామ్మోహన్ మరిన్ని విజయాలు సాధించాలి: మంత్రి నారా లోకేశ్
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ నిబద్ధత, పనితనం, మీ దృఢ సంకల్పాన్ని దగ్గరగా చూశాను. మీరు భారతదేశ పౌర విమానయాన రంగాన్ని రూపొందిస్తున్న తీరు మాకు గర్వంగా ఉంది. మీకు మంచి ఆరోగ్యం, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను’ అని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వంశీకి ఊహించని షాక్.. మరో కేసు నమోదు
గవర్నర్‌ను కలవనున్న జగన్.. పోలీసులు అలర్ట్
Read Latest AP News And Telugu News