Minister Nara Lokesh: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్
ABN , Publish Date - Nov 04 , 2025 | 03:11 PM
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ మంగళవారం ప్రజాదర్బార్ నిర్వహించారు.
అమరావతి, నవంబరు4 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ప్రజాదర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో 70వ రోజు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని మంత్రి లోకేష్ ఇవాళ(మంగళవారం) నిర్వహించారు. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్‌కు అర్జీలు ఇచ్చేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు మంత్రి లోకేష్.
వారిని అప్యాయంగా పలుకరిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. అప్పటికప్పుడే ఆయా సమస్యల పరిష్కారం కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు దాదాపు 2 వేల మందిని కలిసి విజ్ఞప్తులు స్వీకరించారు మంత్రి లోకేష్. ఈ క్రమంలో ప్రతి ఒక్కరితో ఫొటోలు దిగుతున్నారు. చివరి వ్యక్తిని కలిసే వరకు మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ కొనసాగనుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఉల్లి రైతుల సమస్యలని ఏపీ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి: ఎంపీ అవినాశ్ రెడ్డి
కల్పిత వీడియోలపై హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News