Share News

Fake Liquor Case: నకిలీ మద్యం కేసు.. కస్టడీకి నిందితులను ఇస్తూ కోర్టు కీలక ఆదేశాలు

ABN , Publish Date - Nov 04 , 2025 | 07:53 PM

కూటమి ప్రభుత్వ హయాంలో నకిలీ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఆ క్రమంలో జగన్ మోహన్ రావు, జనార్దన్ రావు అనే వ్యక్తులు అరెస్ట్ చేశారు.

Fake Liquor Case: నకిలీ మద్యం కేసు.. కస్టడీకి నిందితులను ఇస్తూ కోర్టు కీలక ఆదేశాలు

విజయవాడ, నవంబర్ 04: నకిలీ మద్యం కేసు వ్యవహారంలో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏడుగురు నిందితులను సిట్ అధికారుల కస్టడీకి ఇస్తూ ఆరో అడిషనల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో ఏ4 రవి, ఏ7 బాధల్ దాస్, ఏ8 ప్రదీప్ దాస్, ఏ11 శ్రీనివాస్ రెడ్డి, ఏ 12 కళ్యాణ్, ఏ15 రమేశ్ బాబు, ఏ 16 అల్లాబక్షిలను ఐదు రోజులు సిట్ కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. వీరంతా నకిలీ మద్యం కేసులో అరెస్టయి ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.


అయితే ఈ కేసులో తాజాగా వీరిని కస్టడీకి అనుమతించడంతో.. ఈ వ్యహారానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ అధికారులు భావిస్తున్నారు. అలాగే వీరి కస్టడీతో ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలో నమోదైన రెండు కేసులు సైతం ఒక కొలిక్కి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే కేసులో జనార్దన్ రావు, జగన్ మోహన్ రావులను సైతం ఇప్పటికే సిట్ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.


గత జగన్ ప్రభుత్వంలో జే బ్రాండ్ పేరిట నకిలీ మద్యం ఏరులై పారింది.. ఈ మద్యం తాగడం వల్ల వేలాది మంది అనార్యోగం బారిన పడి మరణించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాంటి వేళ తాము అధికారంలోకి వస్తే.. ఈ జే బ్రాండ్ మద్యాన్ని రద్దు చేస్తామంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు హామీ ఇచ్చారు. 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి ఏపీ ఓటరు పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొలువు తీరింది. అనంతరం జగన్ ప్రభుత్వం హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సిట్ ఏర్పాటు చేశారు. ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. జగన్ ప్రభుత్వ హయాంలో రూ. 3500 కోట్ల మేర మద్యం కుంభకోణం జరిగినట్లు సిట్ నిర్ధారించింది.


మరోవైపు కూటమి ప్రభుత్వ హయాంలో నకిలీ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఆ క్రమంలో జగన్ మోహన్ రావు, జనార్దన్ రావు అనే వ్యక్తులు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. వీరు విచారణలో చెప్పిన అంశాల ఆధారంగా మాజీ మంత్రి జోగి రమేశ్‌ను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ని నెల్లూరు జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి.. వీరిని సిట్‌ కస్టడీకి ఇవ్వడం వల్ల మరిన్ని విషయాలు బహిర్గతమవుతాయని చర్చ సాగుతోంది.

ఈ వార్తలు కూడా చదవండి..

కార్తీక పౌర్ణమి.. 365 వత్తులతో దీపారాధన.. ఎందుకు వెలిగిస్తారంటే?

ఈ వస్తువులను దానం చేస్తే.. అమ్మవారి అనుగ్రహం..

For More AP News And Telugu News

Updated Date - Nov 04 , 2025 | 08:14 PM