Share News

Andhra cricketer Sricharani: నా ఫేవరేట్ టాలీవుడ్ హీరో అతనే: శ్రీ చరణి

ABN , Publish Date - Nov 04 , 2025 | 07:31 PM

మహిళల వన్డే ప్రపంచకప్‌ 2025లో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో కడప జిల్లాకు చెందిన 21 ఏళ్ల శ్రీ చరణి.. 9 మ్యాచ్‌ల్లో 4.96 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టి.. అద్భుతంగా రాణించింది. 9 మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ మినహా.. ప్రతీ మ్యాచ్‌లో శ్రీ చరణి వికెట్ తీసింది.

Andhra cricketer Sricharani: నా ఫేవరేట్ టాలీవుడ్ హీరో అతనే: శ్రీ చరణి
Sricharani

క్రీడా వార్తలు: మహిళల వన్డే ప్రపంచకప్‌ 2025లో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో కడప జిల్లాకు చెందిన 21 ఏళ్ల శ్రీ చరణి(Sricharani).. 9 మ్యాచ్‌ల్లో 4.96 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టి.. అద్భుతంగా రాణించింది. 9 మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ మినహా.. ప్రతీ మ్యాచ్‌లో శ్రీ చరణి వికెట్ తీసింది. ఫైనల్‌తో సహా సెమీ ఫైనల్లో ఆమె కట్టడిగా బౌలింగ్ చేసి.. కప్ (India Women World Cup 2025)గెలవడంలో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ఆమెకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే టోర్నీకి ముందు శ్రీ చరణి ఇచ్చిన ఇంటర్వ్యూ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ ఇంటర్వ్యూలో ఆమె తనకు ఇష్టమైన టాలీవుడ్ హీరో ఎవరనేది తెలిపింది.


శ్రీ చరణి మాట్లాడుతూ... తాను మంచి ఫుడ్ లవర్‌నని, స్వీట్లు(Sweets) తప్ప మిగిలిన అన్నింటిని ఇష్టంగా తింటానని తెలిపింది. అమ్మ చేతి వంట అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది. క్రికెట్ టోర్నీల కారణంగా ఇంటి భోజనానికి దూరమయ్యానని గుర్తు చేసుకుంది. తాను బాగా ఆడకపోతే.. తినకపోవడం వల్లే అనుకొని తన తల్లి ప్రత్యేకంగా వండి పెట్టేదని చెప్పుకొచ్చింది. బిజీ షెడ్యూల్ కారణంగా ఈ మధ్య ఎక్కువ సినిమాలు చూడడం లేదు కానీ ఒకప్పుడు ప్రభా‌స్ మూవీ ఏది వచ్చినా వదిలేదాన్ని కాదని, ప్రభాష్(Prabhas Fan) అంటే తనకు చాలా ఇష్టమని శ్రీ చరణి(Sricharani).. తన మనసులోని మాటను వెల్లడించింది.


ఇక వరల్డ్ కప్ విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రపంచకప్(India Women World Cup 2025) ఆడిన తొలి క్రికెటర్ గా శ్రీచరణికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఈ టోర్నీలో పటిష్టమైన ఆస్ట్రేలియాపై లీగ్ మ్యాచ్‌తో పాటు సెమీఫైనల్లో శ్రీ చరణి అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఆస్ర్టేలియాతో జరిగిన రెండూ మ్యాచుల్లో ఆమె 5 వికెట్లు పడగొట్టింది. సెమీఫైనల్ ఓటమి తర్వాత ఆసీస్ కెప్టెన్ అలీసా హీలీ.. భారత జట్టులో శ్రీ చరణి(Sricharani) ప్రమాదకరమైన బౌలర్ అని ప్రశంసించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా కెప్టెనే శ్రీ చరణి బౌలింగ్ ను కొనియాడిందటే.. ఆమె ఎంత డేజరస్ బౌలరో అర్థం చేసుకోవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి:

Laura Wolvaardt: షెఫాలీ బౌలింగ్‌కు షాకయ్యాం: లారా

Shree Charani: ప్రపంచ కప్‌లో కడప బిడ్డ!

Updated Date - Nov 04 , 2025 | 08:00 PM