India Women World Cup 2025: అలా చేయడం న్యాయమా? బీసీసీఐపై క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్!
ABN , Publish Date - Nov 04 , 2025 | 06:32 PM
చిరస్మరణీయ విజయం సాధించిన భారత మహిళల జట్టు విజయోత్సవ ర్యాలీ ఉంటుందని క్రికెట్ అభిమానులు భావించారు. కానీ వారిని బీసీసీఐ నిరాశకు గురి చేసింది. ఆదివారం కప్ గెలిస్తే... ఇప్పటి వరకు బీసీసీఐ ఎలాంటి విజయోత్సవ వేడుకలు నిర్వహించలేదు.
క్రీడా వార్తలు: భారతీయుల దశాబ్దాల కల.. ఈ ఏడాది సాకారం అయింది. మహిళల ప్రపంచ కప్ అంటే మనకు రాదులే అనే అంతలా నిరాశ స్థితిలోకి వెళ్లిన ఇండియన్స్ కు హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోనే మహిళ జట్టు ఊపిరినిచ్చింది. వారి కృషికి మహిళల వన్డే ప్రపంచకప్(India Women World Cup 2025)లో టీమిండియా విజేతగా నిలిచింది. 2005, 2017లో తృటిలో చేజారిన కప్‌ను ఈ సారి ఏ తప్పిదం చేయకుండా ప్రపంచ కప్ ను భారత్ ముద్దాడింది. ఫైనల్ ఒత్తిడిని చిరునవ్వుతో ఛేదిస్తూ తొలిసారి ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా(South Africa)ను మట్టి కరిపించింది. విశ్వ విజేతగా భారత మహిళ జట్టు నిలవడంతో మగువల క్రికెట్‌కు ఆదరణ భారీగా పెరగనుంది. ఇది ఇలా ఉంటే ఓ విషయంలో క్రికెట్ ఫ్యాన్స్ బీసీసీఐ(BCCI)పై ఫైర్ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
చిరస్మరణీయ విజయం సాధించిన భారత మహిళల(India Women team) జట్టు విజయోత్సవ ర్యాలీ ఉంటుందని క్రికెట్ అభిమానులు భావించారు. కానీ వారిని బీసీసీఐ నిరాశకు గురి చేసింది. ఆదివారం కప్ గెలిస్తే... ఇప్పటి వరకు బీసీసీఐ ఎలాంటి విజయోత్సవ వేడుకలు నిర్వహించలేదు. అంతేకాక చాలా మంది ప్లేయర్లు తమ స్వస్థలాలకు కూడా వెళ్లిపోయారు. ధోనీ, రోహిత్ ప్రపంచకప్ గెలిచినప్పుడు నిర్వహించిన ఓపెన్ బస్ పరేడ్ తరహాలో అమ్మాయిల విజయాన్ని కూడా బీసీసీఐ (BCCI)సెలెబ్రేట్ చేస్తుందని అందరూ భావించారు.
కానీ బీసీసీఐ అలాంటి ఏర్పాట్లు ఏం చేయలేదు. దాంతో క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయిలకు ఒక న్యాయమా? పురుషులకు మరో న్యాయమా? అని మండిపడుతున్నారు. అయితే ఈ విజయోత్సవ ర్యాలీ నిర్వహించకపోవడానికి ఓ కారణం ఉందని సమాచారం. త్వరలో దుబాయ్(Dubai) వేదికగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ(BCCI) ప్రపంచకప్ విజయోత్సవ వేడుకలను నిర్వహించడంలేదని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఎలాంటి విజయోత్స వేడుకలు ప్లాన్ చేయలేదని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Laura Wolvaardt: షెఫాలీ బౌలింగ్‌కు షాకయ్యాం: లారా
Shree Charani: ప్రపంచ కప్‌లో కడప బిడ్డ!