Share News

Ashwin: అమ్మాయిలు చేసినట్టు మేం చేయలేకపోయాం: అశ్విన్

ABN , Publish Date - Nov 04 , 2025 | 10:18 AM

మహిళా జట్టు ప్రపంచకప్ గెలిచిన తర్వాత మిథాలీ రాజ్‌కు ట్రోఫీ అందించడం అద్భుతమని రవిచంద్రన్ అశ్విన్ అభినందించాడు. పురుషుల జట్టు అలాంటి పని ఎప్పుడూ చేయలేదని పేర్కొన్నాడు.

Ashwin: అమ్మాయిలు చేసినట్టు మేం చేయలేకపోయాం: అశ్విన్

ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్‌(Women’s World Cup 2025)లో టీమిండియా ఘన విజయం సాధించింది. తమ చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకుంటూ.. సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. గతంలో రెండు సార్లు ఫైనల్ చేరుకున్నా.. ఆఖరి మెట్టుపై బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న పట్టుదలతో పోరాడి నిలిచి గెలిచింది. విశ్వవిజేతగా చరిత్ర తిరగరాసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) ఆ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు.


‘భారత మహిళల జట్టు అద్భుతం చేసింది. ప్రతి ప్లేయర్ గొప్పగా ఆడారు. ఇదంతా ఒక ఎత్తయితే ఇక్కడే అసలు విషయం ఉంది. ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ట్రోఫీని తీసుకెళ్లి మిథాలీరాజ్‌(Mithali Raj)కు అందించింది. ఈ విషయంలో నేను వారిని అభినందిస్తున్నా. భారత పురుషుల జట్టు ఇలా గతంలో ఎప్పుడూ చేయలేదు. కొన్నిసార్లు మీడియా ముందు మాత్రం ఏదో చెబుతూ ఉంటాం. కానీ ఈ తరానికి బాట వేసిన మునుపటి తరాన్ని పట్టించుకోము. గెలుపును మాజీలకు అంకితం చేయడం అనేది నేను ఇప్పటికి వరకు చూడలేదు. ‘మా తరం జట్టు బాగుంది..’ ‘మీ తరం జట్టులో అంత ప్రదర్శన ఇచ్చే వాళ్లు లేరు..’ అనే మాటలే చర్చలకు వస్తుంటాయి. కానీ ఇలా ట్రోఫీని వారికి అంకితం చేయడం గొప్ప విషయం’ అని అశ్విన్ అన్నాడు.


25 ఏళ్ల శ్రమకు ఫలితం..

‘అంజుమ్ చోప్రా, మిథాలీ రాజ్‌కు టీమిండియా ప్రపంచ కప్‌ను తీసుకెళ్లి అందించింది. దీంతో వారు కూడా భావోద్వేగానికి, ఆనందానికి లోనయ్యారు. అలా ట్రోఫీ ఇవ్వడం చాలా బాగుంది. భారత మహిళల జట్టుకు ఈ విజయం ఒక్క రోజులో వచ్చింది కాదు. ఇది 25 ఏళ్ల శ్రమకు ఫలితం. భారత మహిళల జట్టు విజయం.. గతంలో సాధించిన ప్రపంచ కప్‌ల కంటే గొప్పది. ఎందుకంటే ప్రస్తుతం మహిళ జట్టు విజయంతో చాలా మంది వనితలు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుని ముందుకు వస్తారు. వారికి ఈ జట్టే ఆదర్శం అవుతుంది’ అని అశ్విన్ వివరించాడు.


ఈ వార్తలు కూడా చదవండి:

Laura Wolvaardt: షెఫాలీ బౌలింగ్‌కు షాకయ్యాం: లారా

Shree Charani: ప్రపంచ కప్‌లో కడప బిడ్డ!

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 04 , 2025 | 10:25 AM