Ganja Seized: 112 కేజీల గంజాయి పట్టివేత.. ఒకరి అరెస్ట్
ABN , Publish Date - Dec 17 , 2025 | 04:19 PM
గన్నవరంలో భారీగా గంజయి పట్టుబడింది. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కృష్ణా జిల్లా, డిసెంబర్ 17: రాష్ట్రంలో గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. పోలీసులు ఎక్కడిక్కడ తనిఖీలు నిర్వహించి గంజాయిని తరలించే ముఠాను అడ్డుకుని అరెస్ట్‌లు చేస్తున్నారు. తాజాగా గన్నవరంలో గంజాయి అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకుని భారీగా గంజాయిని సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే...
కృష్ణా జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. గన్నవరంలోని బీబీ గూడెం అండర్ పాస్ వద్ద పోలీసులు ఈరోజు (బుధవారం) వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించి వెంటనే అడ్డుకున్నారు. దాదాపు 112 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న మహారాష్ట్ర పూణేకు చెందిన దీపక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు పూర్వాపరాలను జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వివరించారు. సాధారణ వాహన తనిఖీల్లో గంజాయి అక్రమ రవాణాను అడ్డుకున్నామని ఎస్పీ తెలిపారు. పెనమలూరులో కూడా గంజాయి ప్యాకెట్లు పార్శిల్ చేస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ విద్యాసాగర్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
శ్రీచరణికి రూ.2.5 కోట్ల బహుమతి.. స్వయంగా చెక్ ఇచ్చిన మంత్రి లోకేష్
ఫలితాల కోసం పరీక్ష రాసిన విద్యార్థిలా ఎదురు చూస్తా: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News