Minister Nara Lokesh: శ్రీచరణికి రూ.2.5 కోట్ల బహుమతి.. స్వయంగా చెక్ ఇచ్చిన మంత్రి లోకేష్
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:11 PM
మహిళా క్రికెటర్ శ్రీచరణిని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. మంత్రి నారా లోకేష్ రూ.2.5 కోట్ల చెక్‌ను స్వయంగా శ్రీచరణికి అందజేశారు.
అమరావతి, డిసెంబర్ 17: మహిళా క్రికెటర్ శ్రీచరణికి (Indian cricketer Sricharani) రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) నగదు ప్రోత్సాహకం అందజేసింది. ఇటీవల జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన శ్రీచరణిని ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) రూ.2.5 కోట్ల చెక్‌ను శ్రీచరణికి అందజేశారు. ఈరోజు (బుధవారం) ఉండవల్లి నివాసంలో క్రికెటర్ శ్రీచరణికి మంత్రి లోకేష్ స్వయంగా చెక్‌ను అందించారు. ఆమె ప్రతిభను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సహకాలు ప్రకటించిన విషయం తెలిసిందే.

రూ.2.5 కోట్ల మేర నగదు ప్రోత్సాహంతో పాటు విశాఖలో 500 గజాల విస్తీర్ణం గల ఇంటి స్థలాన్ని సర్కార్ కేటాయించింది. అలాగే డిగ్రీ పూర్తయిన తర్వాత శ్రీచరణికి రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్-1 హోదా ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో రవాణా, యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు, క్రీడా శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, శాప్ ఎండీ భరణి, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ట్రెజరర్ డి.శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ బి.విజయ్ కుమార్ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి...
కలెక్టర్ల కాన్ఫరెన్స్... డేటా డ్రైవెన్ గవర్నెన్స్‌పై సీఎం ఫోకస్
కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం పవన్ కీలక సూచనలు
Read Latest AP News And Telugu News