Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం పవన్ కీలక సూచనలు
ABN , Publish Date - Dec 17 , 2025 | 11:25 AM
గ్రామీణ స్థాయిలో పాలనా సామర్ధ్యాల పెంపు కోసం కృషి చేయాలని కలెక్టర్లకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలు చేశారు. ఐదవ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం పాల్గొని ప్రసంగించారు.
అమరావతి, డిసెంబర్ 17: రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్న కలెక్టర్లు అందరికీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. 5 వ జిల్లా కలెక్టర్ల సదస్సులో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. 4 వేల కిలోమీటర్ల మేర గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేశామన్నారు. 1.20 లక్షల ఫాం పాండ్స్ తవ్వి లక్ష్యాలను చేరుకున్నామన్నారు. రూ. 4,330 కోట్ల మేర నిధులను వేతనాలుగా నరేగా నుంచి చెల్లించామని.. గ్రామ పంచాయితీల్లో రెవెన్యూ ఆర్జనపై కూడా దృష్టి సారించామని చెప్పారు.
గ్రామీణ స్థాయిలో పాలనా సామర్ధ్యాల పెంపు కోసం కృషి చేయాలని సూచించారు. మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధిపైనా కలెక్టర్లు దృష్టి పెట్టాలని అన్నారు. కేంద్ర పథకాల అమలులో వంద శాతం ఫలితాలు సాధించిన అల్లూరి, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టర్లను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు.
ఇవి కూడా చదవండి...
వామ్మో పెద్దపులి.. భయాందోళనలో సింగరేణి కార్మికులు
కలెక్టర్ల కాన్ఫరెన్స్... డేటా డ్రైవెన్ గవర్నెన్స్‌పై సీఎం ఫోకస్
Read Latest AP News And Telugu News