Share News

CM Chandrababu: కలెక్టర్ల కాన్ఫరెన్స్... డేటా డ్రైవెన్ గవర్నెన్స్‌పై సీఎం ఫోకస్

ABN , Publish Date - Dec 17 , 2025 | 10:33 AM

సచివాలయంలో జరుగుతున్న ఐదవ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పలు కీలక అంశాలపై చర్చ జరుగనుంది. క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్లు చేపట్టాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.

CM Chandrababu: కలెక్టర్ల కాన్ఫరెన్స్... డేటా డ్రైవెన్ గవర్నెన్స్‌పై సీఎం ఫోకస్
CM Chandrababu

అమరావతి, డిసెంబర్ 17: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababau Naidu) అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు (బుధవారం) 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. సుపరిపాలన, సుస్థిరాభివృద్ధి, సంక్షేమం అజెండాగా రెండు రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగనుంది. జీఎస్డీపీ లక్ష్యాలు, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లు, సుస్థిరాభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించనున్నారు. కేంద్ర నిధులను వివిధ ప్రభుత్వ శాఖలు ఏ విధంగా వినియోగించారు... యూసీలను ఏ మేరకు జారీ చేశాయనే అంశాలపై సమీక్ష జరుపనున్నారు.


సూపర్ సిక్స్ పథకాల అమలు, ఇ-ఆఫీస్, డేటా డ్రైవెన్ గవర్నెన్స్, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై సీఎం సమీక్ష చేయనున్నారు. క్షేత్ర స్థాయిలో జిల్లా కలెక్టర్లు చేపట్టాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి. ఇక ఈ కలెక్టర్ల సదస్సులో సీఎస్ కె.విజయానంద్ ప్రారంభోపన్యాసం చేశారు. పాలనా సమీక్షకు కలెక్టర్ల సదస్సు కీలక భూమిక పోషిస్తోందని తెలిపారు. మొంథా సైక్లోన్ సమయంలో వేగంగా స్పందించిన జిల్లా కలెక్టర్లందరికీ అభినందనలు తెలియజేశారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ సహా మూడు ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నామని తెలిపారు.


ఆంధ్రప్రదేశ్ దీర్ఘకాలిక లక్ష్యాలు, జిల్లాల అభివృద్ధి, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, ప్రజల్లో సంతృప్త స్థాయి వంటి అంశాలపై చర్చించుకుందామన్నారు. ఆరు జిల్లాల కలెక్టర్లు తాము అవలంభించిన బెస్ట్ ప్రాక్టీసెస్‌ను ప్రెజెంట్ చేయబోతున్నారని చెప్పారు. రహదారి భద్రతపై కూడా అంతా దృష్టి పెట్టాల్సి ఉందని... ఈ ఆంశంపైనా సమావేశాల్లో విస్తృతంగా చర్చించాల్సి ఉందని సీఎస్ విజయానంద్ పేర్కొన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా వివిధ శాఖల మంత్రులు హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి...

ఒక్కో ఓటుకు రూ.3 వేలు.. డబ్బులు తీసుకుని కూడా..

వామ్మో పెద్దపులి.. భయాందోళనలో సింగరేణి కార్మికులు

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 17 , 2025 | 10:49 AM