TDP Kambhampati Rammohan Rao: మాజీ ఎంపీ.. టీడీపీ సీనియర్ నేత ఇంట్లో విషాదం
ABN , Publish Date - Dec 17 , 2025 | 09:12 AM
మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి వెంకట నరసమ్మ (99) ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు.
అమరావతి: మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి వెంకట నరసమ్మ (99) ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. వృద్ధాప్య కారణాలతో ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మాజీ ఎంపీ నివాసానికి చేరుకుని తమ సంతాపాన్ని తెలిపారు.
వెంకట నరసమ్మ అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం పెద్ద అవుటుపల్లి గ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆమె మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, పార్టీ నేతలు, అభిమానులు సోషల్ మీడియాలో సంతాపం తెలుపుతున్నారు.
Also Read:
సీసీఎల్‌ఏ కార్యాలయం వద్ద వీఆర్‌ఏల మహాధర్నా
22 ఏ భూములపై ఏలూరులో మెగా గ్రీవెన్స్ సెల్
For More Latest News