Nadendla Manohar: 22 ఏ భూములపై ఏలూరులో మెగా గ్రీవెన్స్ సెల్
ABN , Publish Date - Dec 17 , 2025 | 06:24 AM
లూరు జిల్లాలో 22 ఏ కింద నిషేధిత భూ ముల సమస్యల పరిష్కారానికి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో....
ఏలూరు జిల్లా రోల్ మోడల్‌గా నిలుస్తుందన్న మంత్రి నాదెండ్ల
ఏలూరు, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లాలో 22 ఏ కింద నిషేధిత భూ ముల సమస్యల పరిష్కారానికి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మెగా గ్రీవెన్స్ సెల్‌కు అనూహ్య స్పందన లభించింది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఏలూరులో నిర్వహించిన ఈ గ్రీవెన్స్‌లో జిల్లాలోని 27 మండలాలకు చెందిన రైతులు, మాజీ సైనికులు, ఇతర వర్గాల ప్రజల నుంచి సుమారు 70 వరకు ఫిర్యాదులందాయి. రెవెన్యూ, దేవదాయ, రిజిస్ర్టేషన్ శాఖల ఆధ్వర్యంలో సమస్యలకు రెండు వారాల్లో పరిష్కార మార్గాలను అన్వేషించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.