Share News

CM Chandrababu: ఏపీ వృద్ధిరేటు పెంపునకు ప్రభుత్వం చర్యలు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ABN , Publish Date - Dec 10 , 2025 | 11:12 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వృద్ధిరేటు పెంపునకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు.

CM Chandrababu: ఏపీ వృద్ధిరేటు పెంపునకు ప్రభుత్వం చర్యలు.. అధికారులకు సీఎం  చంద్రబాబు కీలక ఆదేశాలు
CM Chandrababu

అమరావతి, డిసెంబరు10 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) రాష్ట్ర వృద్ధిరేటు పెంపునకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలతో ఇవాళ(బుధవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏపీ వృద్ధిరేటు అమలుపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. వృద్ధిరేటు పెంపునకు రానున్న నాలుగు నెలల్లో తీసుకోవాల్సిన అంశాలు, అమలు చేయాల్సిన ప్రణాళికపై సూచనలు చేశారు సీఎం చంద్రబాబు.


ఈ ఆర్థిక సంవత్సరంలో 17.11 శాతం మేర వృద్ధి రేటు సాధించేలా లక్ష్యం పెట్టుకున్నామని వివరించారు. 2025 నుంచి 2026 ఆర్థిక సంవత్సరంలోని మొదటి రెండు త్రైమాసికాల్లో సాధించిన ఆర్థిక ఫలితాలపై ఈ సమావేశంలో చర్చించారు. మూడు, నాలుగు త్రైమాసికాల్లో సాధించాల్సిన లక్ష్యాలపై అధికారులకు సీఎం మార్గనిర్దేశం చేశారు. జీఎస్డీపీ, కేపీఐ, పబ్లిక్ పాజిటివ్ పర్‌సెప్షన్, డేటా డ్రివెన్ గవర్నెన్స్, తదితర అంశాలపై సూచనలు చేశారు సీఎం చంద్రబాబు.


సూపర్ సిక్స్ పథకాలు, పౌరసేవలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమీక్షిస్తున్నారు. ఫైళ్ల క్లియరెన్స్, ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక, అవేర్, డేటాలేక్, ఐటీ అప్లికేషన్లపై సమావేశంలో ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలు, ఫిర్యాదులు వాటి పరిష్కారంపై హెచ్ఓడీలకు ముఖ్యమంత్రి సూచనలు చేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు వాటి ఫలితాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న రుణాలు, వాటి రీస్ట్రక్చరింగ్ అంశంపై శాఖల వారీగా మాట్లాడుతున్నారు సీఎం చంద్రబాబు.


ఈ వార్తలు కూడా చదవండి..

వివేకారెడ్డి హత్య కేసు.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ

కాలేజ్‌ భవనంపై నుంచి కిందపడ్డ విద్యార్థి.. పరిస్థితి విషమం

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 10 , 2025 | 11:33 AM