Amaravati Development: రెండో విడత ల్యాండ్ పూలింగ్.. రైతుల అంగీకారం
ABN , Publish Date - Dec 10 , 2025 | 10:51 AM
అమరావతి అభివృద్ధి, విస్తరణ కోసం భూములు ఇచ్చేందుకు వడ్డమాను రైతులు అంగీకారం తెలిపారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు గ్రామ రైతులు మద్దతుగా నిలిచారు.
అమరావతి, డిసెంబర్ 10: రాజధాని అమరావతిలోని తుళ్ళూరు మండలంలో మంత్రి నారాయణ ఈరోజు (బుధవారం) పర్యటించారు. వడ్డమాను గ్రామంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుళ్లూరు మండలం వడ్డమాను గ్రామంలో రెండో విడత ల్యాండ్ పోలింగ్‌కు రైతులు అంగీకారం తెలిపారు. అయితే కౌలు ప్యాకేజీ పెంచాలని మంత్రికి రైతులు వినతి చేశారు. గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు తమ పాసుపుస్తకాలను మంత్రి నారాయణకు అందజేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఏడు గ్రామాల్లో 16.666 వేల పైచిలుకు భూమి అవసరమన్నారు. 2014 -19 లో రాజధాని రైతుల సలహాలతో పాలసీ నిర్ణయించామని.. అదే విధంగా రైతులతో చర్చించి వారి నిర్ణయాల ప్రకారం ముందుకు వెళ్తామని చెప్పారు. ప్రభుత్వం మారటం వలన గత ప్రభుత్వం కేసుల వల్ల జాప్యం జరిగిందన్నారు. తమ పరిధిలో చేయగలిగిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
రోడ్లు, డ్రైన్లు సరి చేయమని రైతులు కోరారని.. అది పూర్తి చేస్తామని చెప్పారు. 29 గ్రామాలను అభివృద్ధి చేయడానికి రూ.900 కోట్లు అవసరమని తెలిపారు. ఆరు నెలల్లో తొమ్మిది గ్రామాలను అభివృద్ధి చేయడానికి ఆదేశాలు ఇచ్చామన్నారు. వడ్డమాను గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రైతులు ఏ విధంగా అడిగితే అలా అభివృద్ధి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
వివేకారెడ్డి హత్య కేసు.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ
కాలేజ్ భవనంపై నుంచి కిందపడ్డ విద్యార్థి.. పరిస్థితి విషమం
Read Latest AP News And Telugu News