Home » AP High Court
గతేడాది ద్విచక్ర వాహన ప్రమాదాలలో 4,276 మంది మరణించడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
సోషల్ మీడియా వేదికగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డిపై నిరాధార ఆరోపణలు, వ్యక్తిత్వ హననం చేస్తూ ట్రోల్ చేయడాన్ని ఏపీ బార్ కౌన్సిల్ ఖండించింది.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే సోషల్ మీడియా కేసుల్లో రిమాండ్ విధిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హై కోర్టు స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో అనుచిత, అభ్యంతరకర పోస్టులు, వ్యాఖ్యల కేసుల్లో నిందితులకు రిమాండ్ విధించే సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని ఏపీ హైకోర్ట్ తేల్చిచెప్పింది.
టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం)కి నకిలీ నెయ్యి సరఫరా చేసిన కేసులో భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పోమిల్ జైన్(ఏ3), విపిన్ జైన్(ఏ4), వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయ్‌కాంత్ చావడా(ఏ5)లకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
తిరుపతి, ఎంఆర్ పల్లి పరిధిలోని సర్వే నెంబర్లు 261/1లోని 1.50 ఎకరాలు, 261/2లోని 2.38 ఎకరాలకు సంబంధించిన భూదస్త్రాలను వారం రోజుల్లో వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అందజేయాలని తిరుపతి బుగ్గ మఠం అసిస్టెంట్ కమిషనర్/ఈవోను హైకోర్టు ఆదేశించింది.
టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావుల హత్య కేసు విషయంలో నిందితులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలపై పది రోజులపాటు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
నెల్లూరు జైల్లో ఉన్న వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్ నెల్లూరు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు పట్టణంలోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో తాత్కాలిక హెలీప్యాడ్ ఏర్పాటు చేసుకొనేందుకు అనుమతించేలా అధికారులను ఆదేశించాలని...
మాజీ సీఎం జగన్ గుంటూరు జిల్లా రెంటపాళ్లలో పర్యటించిన సమయంలో ఆయన కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన కేసులో తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Jagan High Court: సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం జగన్‌కు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. రెండు వారాల వరకూ తదనంతర చర్యలు తీసుకోవద్దని పోలీసులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఇచ్చిన బెయిల్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వంశీ బెయిల్‌పై సుప్రీంకోర్ట్‌లో ప్రభుత్వం సవాల్ చేయనుంది. ఈ మేరకు సుప్రీంకోర్ట్‌లో ఉన్న అడ్వకేట్ ఆన్ రికార్డ్స్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.