ఏపీ లిక్కర్ కేసు.. ముగ్గురికి బెయిల్.. మరో ఇద్దరికి షాక్
ABN , Publish Date - Jan 29 , 2026 | 11:22 AM
ఏపీ మద్యం కుంభకోణంలో నిందితుల బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి, ముప్పిడి అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది.
అమరావతి, జనవరి 29: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో(AP Liquor Scam) నిందితుల బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు(AP HighCourt) కొట్టివేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సజ్జల శ్రీధర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్ నాయుడు(చెవిరెడ్డి అనుచరుడు)లకు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. అయితే.. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి, ముప్పిడి అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్లను మాత్రమం న్యాయస్థానం కొట్టివేసింది.
బెయిల్ వచ్చిన ముగ్గురికి కోర్టు పలు షరతులను విధించింది. ప్రధానంగా పాస్‌పోర్టులను మేజిస్ట్రేట్ కోర్టులో సమర్పించాలని, న్యాయమూర్తి అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని ఆదేశించింది. అదే విధంగా బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి కూడా పలు కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఈ షరతులకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
ఇక ఈ కేసులో ఇప్పటికే ఐదుగురికి బెయిల్ మంజూరు అయిన విషయం తెలిసిందే. ఇందులో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, జగన్ సెక్రెటరీగా ఉన్న ధనుంజయ్ రెడ్డితో పాటు భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, రాజంపేట ఎంపీ అవినాశ్ రెడ్డి సహా మరొకరికి బెయిల్ వచ్చింది. తాజాగా మరో ముగ్గురికి కూడా బెయిల్ లభించింది. దీంతో ఈ కేసులో మొత్తం ఎనిమిది మందికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాదాపు వంద రోజుల తర్వాత సజ్జల శ్రీధర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్ నాయుడులకు బెయిల్ ఇవ్వడంతో పాటు పలు షరతులను హైకోర్టు విధించింది.
ఇవి కూడా చదవండి
ఏసీబీ మెరుపు సోదాలు.. వాటిపై అధికారుల ఫోకస్..
మేడారంలో మరో కీలక ఘట్టం.. పలువురు ప్రముఖులు రాక..
Read Latest AP News And Telugu News