సామాన్యులకు షాక్.. ఊహించని స్థాయిలో పెరిగిన పసిడి ధర
ABN , Publish Date - Jan 29 , 2026 | 09:56 AM
నేడు దేశంలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. గుండెలు అదిరే స్థాయిలో పెరిగాయి. మరి నేటి రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో బంగారం ధర ఒక్కసారిగా భగ్గుమంది. నేడు ట్రేడింగ్ ఆరంభంలోనే మేలిమి బంగారం ధర సుమారు రూ.12 వేల మేర పెరగ్గా వెండి ధర ఏకంగా రూ.30 వేల మేర ఎగబాకింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు ఉదయం 10 గంటల సమయంలో దేశంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం నిన్నటితో పోలిస్తే రూ.11,770 మేర పెరిగి రూ.1,78,850కు చేరుకుంది. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.10,800 మేర పెరిగి రూ.1,63,950కు చేరుకుంది. వెండి ధర కూడా భారీగా పెరిగింది. నేడు ట్రేడింగ్ ఆరంభంలోనే సుమారు రూ.30 వేల మేర పెరిగి రూ.4,10,000లకు చేరుకుంది.
నగరాల వారీగా చూస్తే హైదరాబాద్‌లో ప్రస్తుతం 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,78,850గా ఉంది. ఢిల్లీలో అత్యధికంగా రూ.1,79,000 వేలకు ఎగబాకింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ బంగారం ధర రూ.1,63,950గా, ఢిల్లీలో రూ.1,64,100గా ఉంది. ఇక హైదరాబాద్, చెన్నై నగరాల్లో కిలో వెండి రూ.4,25,000లకు చేరగా, ఢిల్లీ, ముంబైల్లో రూ.4,10,000 వద్ద తచ్చాడుతోంది.
నగరం | 10 గ్రా. 24 క్యారెట్లు (రూపాయలలో) | 10 గ్రా. 22 క్యారెట్లు (రూపాయలలో) |
చెన్నై | 1,83,280 | 1,68,000 |
ముంబై | 1,78,850 | 1,63,950 |
న్యూఢిల్లీ | 1,79,000 | 1,64,100 |
బెంగళూరు | 1,78,850 | 1,63,950 |
కోల్‌కతా | 1,78,850 | 1,63,950 |
హైదరాబాద్ | 1,78,850 | 1,63,950 |
విజయవాడ | 1,78,850 | 1,63,950 |
కేరళ | 1,78,850 | 1,63,950 |
పుణె | 1,78,850 | 1,63,950 |
వడోదర | 1,78,900 | 1,64,000 |
అహ్మదాబాద్ | 1,78,900 | 1,64,000 |
వెండి ధరలు(కిలోకు) ఇవీ..
చెన్నై - రూ.4,25,000
ముంబై - రూ.4,10,000
న్యూఢిల్లీ - రూ.4,10,000
కోల్‌కతా - రూ.4,10,000
బెంగళూరు - రూ.4,10,000
హైదరాబాద్ - రూ.4,25,000
విజయవాడ - రూ.4,25,000
కేరళ - రూ.4,25,000
పుణె - రూ.4,10,000
వడోదర - రూ.4,10,000
అహ్మదాబాద్ - రూ.4,10,000
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవీ చదవండి:
2044 నాటికి భారత్‌కు 3,300 విమానాలు అవసరం.. బోయింగ్ సంస్థ అంచనా
బడ్జెట్ 2026.. పాత పన్ను విధానం కనుమరుగు కానుందా?