ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు
ABN , Publish Date - Feb 05 , 2026 | 03:42 PM
రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసులు నమోదు చేశారని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తనపై నమోదైన కేసుల్లో ఏడేళ్ల లోపు శిక్షలుపడే సెక్షన్లు నమోదు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
అమరావతి: మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) గురువారం ఏపీ హైకోర్టు(AP High Court)ను ఆశ్రయించారు. తనపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలని(Quash) కోరుతూ ఆయన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అంబటి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.. ఈ పిటిషన్‌ను విచారించేందుకు అంగీకరించింది.
రాజకీయ కక్షసాధింపులో భాగంగా తనపై ఏడేళ్ల లోపు శిక్షపడే సెక్షన్లతో కేసులు నమోదు చేశారని రాంబాబు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసుల్లో ట్రయల్ కోర్టు(Trial Court) తనకు రిమాండ్ విధించడాన్ని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తనపై ఉన్న కేసులను కొట్టివేసి, ఊరట కల్పించాలని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సిట్ రిపోర్ట్‌లో జంతువుల కొవ్వు ఉందని స్పష్టంగా ఉంది: పవన్
హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం.. ఉమెన్స్ హాస్టల్లో చెలరేగిన మంటలు
For More AP News And Telugu News