Share News

వైసీపీ హిందూ ద్రోహి: నాగబాబు

ABN , Publish Date - Feb 05 , 2026 | 06:39 AM

వైసీపీ హిందూ ద్రోహి అని ఎమ్మెల్సీ కె.నాగబాబు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో హిందూ ఆలయాలపై జరిగిన దాడులతో పాటు కల్తీ నెయ్యి, లడ్డూపై ఆయన ఒక వీడి యో విడుదల చేశారు.

వైసీపీ హిందూ ద్రోహి: నాగబాబు

అమరావతి, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): వైసీపీ హిందూ ద్రోహి అని ఎమ్మెల్సీ కె.నాగబాబు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో హిందూ ఆలయాలపై జరిగిన దాడులతో పాటు కల్తీ నెయ్యి, లడ్డూపై ఆయన ఒక వీడి యో విడుదల చేశారు. ‘తిరుమల కొండపై రూమ్‌ చార్జీలు ఇష్టారాజ్యాంగా పెంచేశారు. ఇది సామాన్యులను భగవంతుడు నుంచి దూరం చేయడం కాదా? టీటీడీ కామన్‌ గుడ్‌ఫండ్‌కు ఇచ్చే కంట్రిబ్యూషన్‌ రూ.2.50 కోట్లు ఉండేది. దానిని ఒకేసారి రూ.50 పెంచేశారు. ఇక్కడే కాదు, ఎక్కడ కొండ కనిపిస్తే అక్కడ గుండు కొట్టేయడమే అలవాటుగా మార్చుకున్నారు. డిక్లరేషన్‌ను గౌరవించడం మన సాంప్రదాయం. పవన్‌ కల్యాణ్‌ తన సతీమణి, పిల్లలను తీసుకువెళ్లినప్పుడు డిక్లరేషన్‌ ఇచ్చారు. అబ్దుల్‌ కలాం డిక్లరేషన్‌ ఇచ్చారు. ఆయనకంటే నువ్వు గొప్పోడివా..! నీ మంత్రి ‘తిరుమల నీ అమ్మ మొగుడు కట్టాడా?’ అంటూ మాట్లాడతాడా..? అలా తలపొగరుతో మాట్లాడినందుకే 151 లో మధ్యలో 5 తీసేసి 11 సీట్లే ప్రజలు ఇచ్చారు. అయినా ఏం మారలేదు. డిక్లరేషన్‌ అడిగారని తిరుమల పర్యటన మానుకున్న చరిత్ర మీది’ అంటూ నాగబాబు జగన్‌పై విరుచుకుపడ్డారు.

Updated Date - Feb 05 , 2026 | 06:39 AM