తిరుమల వేదికగా కుల రాజకీయాలా?
ABN , Publish Date - Feb 05 , 2026 | 06:41 AM
తిరుమలను వేదికగా చేసుకుని కుల రాజకీయాలు చేయొద్దని వైసీపీకి టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి హితవు పలికారు.
టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): తిరుమలను వేదికగా చేసుకుని కుల రాజకీయాలు చేయొద్దని వైసీపీకి టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి హితవు పలికారు. సీఎం చంద్రబాబుపై నోటి దురదతో ఇష్టారీతిగా మాట్లాడిన వైసీపీ నేతలు.. మళ్లీ ఇప్పుడు కులాల కుంపట్లను రాజేసేందు కు ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కొంతమంది ఆంబోతులను రోడ్డు మీదకి వదిలేసి, వారితో ఇష్టారీతిగా మాట్లాడించి, ఇప్పుడు జగన్ కులాల ప్రస్తావన తేవడం చూస్తుంటే ఇదంతా ముందస్తు ప్రణాళిక అని స్పష్టం అవుతోందన్నారు. ఏపీభవన్‌లో బుధవారం మాట్లాడారు. వైసీపీ పాలనలో తిరుమల లడ్డూ తయారీలో రసాయనాలతో తయారైన మిశ్రమాన్ని వాడారని సిట్ తేల్చిచెప్పినప్పటికీ వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతూ కులాల కుంపటిని రాజేస్తున్నదన్నారు.