Share News

కిడ్నాప్ కేసులో మోహన్ బాబుకు ఎదురుదెబ్బ..

ABN , Publish Date - Feb 17 , 2026 | 08:13 PM

విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసుకు సంబంధించి టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కిడ్నాప్ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. క్వాష్ పిటిషన్‌పై విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది..

కిడ్నాప్ కేసులో మోహన్ బాబుకు ఎదురుదెబ్బ..
Mohan Babu

అమరావతి, ఫిబ్రవరి 17: విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు హైకోర్టులో అనుబంధ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించి మోహన్ బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. క్వాష్ పిటిషన్‌పై విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది. ఫోన్ కాల్స్‌తో పాటు మెసేజ్‌లను విశ్లేషించి ఫోరెన్సిక్ ల్యాబరేటరీ నివేదిక అందజేయాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది.


ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఎఫ్ఐఆర్ ఆధారంగా తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని మోహన్ బాబు తరుఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అనుబంధ పిటిషన్‌ను కొట్టి వేసింది. వ్యాజ్యంపై లోతైన విచారణ జరుపుతామని మార్చి 3వ తేదీకి క్వాష్ పిటిషన్‌ను వాయిదా వేసింది.


ఇంతకీ ఏం జరిగిందంటే..

కొద్దిరోజుల క్రితం మోహన్ బాబు విద్యాసంస్థల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించేందుకు బయల్దేరిన విద్యార్థి సంఘం నాయకులు కిడ్నాప్‌నకు గురయ్యారు. దీనిపై సహచర విద్యార్థి సంఘం నాయకులు తిరుచానూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీస్ ప్రత్యేక బృందాలు వెంటనే రంగంలోకి దిగి.. నారావారిపల్లి సమీపంలోని భీమవరం వద్ద కిడ్నాపర్ల వాహనాన్ని అడ్డుకున్నాయి. కిడ్నాప్‌నకు గురైన విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు విడిపించారు. కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు. కిడ్నాప్‌నకు పాల్పడిన వారంతా మోహన్ బాబు కాలేజీ బౌన్సర్లుగా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబుపై కేసు ఫైల్ అయింది.


ఇవి కూడా చదవండి..

ఫ్రాన్స్ సహకారంతో ఎవరెస్ట్ హైట్స్‌కు వెళ్లే హెలికాప్టర్ల తయారీ.. మోదీ

భారతీయులతో కలిసి ఉంటే ఇంతే.. పాకిస్థానీ వీడియో వైరల్

Updated Date - Feb 17 , 2026 | 08:47 PM