AP High Court: తిరుమల పరకామణి లెక్కింపుపై హైకోర్టు ఆదేశాలివే..
ABN , Publish Date - Dec 19 , 2025 | 12:19 PM
తిరుమల పరకామణిలో కానుకల లెక్కింపు ప్రక్రియను సమూలంగా ప్రక్షాళన చేయాలని ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కానుకల లెక్కింపుకు ఏఐని వినియోగించాలని స్పష్టం చేసింది.
అమరావతి , డిసెంబర్ 19: తిరుమల పరకామణి విషయంలో ఏపీ హైకోర్టు (AP High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. కానుల లెక్కింపు ప్రక్రియను సమూలంగా ప్రక్షాళించాలని ధర్మాసనం ఆదేశించింది. పరకామణిలో చోరీకి సంబంధించి ఈరోజు (శుక్రవారం) హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా టీటీడీకి హైకోర్టు ముఖ్య సూచనలు చేసింది. దొంగతనాలను అరికట్టేందుకు రెండు దశలలో సంస్కరణలు చేపట్టాలని సూచించింది. కానుకల లెక్కింపులో మానవ ప్రమేయాన్ని తగ్గించి ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), అత్యాధునిక యంత్రాలను వినియోగించాలని టీటీడీకి స్పష్టీకరించింది.
ఇందుకోసం తక్షణ, శాశ్వత ప్రణాళికలు రూపొందించాలని టీటీడీకి ఆదేశించింది. హుండీ సీలింగ్, రవాణా, లెక్కింపు విషయంలో తక్షణం చేపట్టాల్సిన భద్రతా చర్యలపై రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఇరువురు న్యాయవాదులకు సూచించింది. శాశ్వత సంస్కరణలో భాగంగా కానుకలను వర్గీకరించడం, విదేశీ కరెన్సీని గుర్తించేందుకు ఏఐను ఉపయోగించడం, విలువైన లోహాలను వేరు చేసే అత్యాధునిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది.
దీనిపై ఎనిమిది వారాల్లోపు ముసాయిదా రూపొందించి కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. నిందితుడు రవికుమార్, అతని కుటుంబ సభ్యుల ఆస్తుల అమ్మకాలు, రిజిస్ట్రేషన్ల వివరాలను సీల్డ్ కవర్లో వారంలోపు తమ ముందు ఉంచాలని ఏసీబీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 26కు హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి...
శ్రీశైలంలో రీల్స్‌పై యువతి క్షమాపణలు
కలకలం సృష్టించిన చాక్లెట్లు.. 11 మంది విద్యార్థినులకు అస్వస్థత
Read Latest AP News And Telugu News