అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ..
ABN , Publish Date - Feb 05 , 2026 | 09:32 PM
ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల చేసి కేసులో అరెస్టయిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును రద్దు చేయాలని (క్వాష్) కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం న్యాయస్థానం విచారణ చేపట్టింది.
అమరావతి: మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలు చేసిన లంచ్ మోషన్‌లో క్వాష్ పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని, రిమాండ్ రిపోర్ట్(Remand report)ను సస్పెండ్ చేయాలని వేసిన పిటిషన్(Petition)పై ఇరువర్గాలు వాదనలు జరిగాయి. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తనపై కేసులు పెట్టారని, దీని వల్ల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతోందని అంబటి తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు.
అంబటిపై ఉన్న కేసులు చట్టవిరుద్ధమని లాయర్ వాదించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం, ఈ పిటిషన్‌పై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు(Counter filing) చేయాలని పోలీసులను ఆదేశించింది. అనంతరం, తదుపరి విచారణ ఈ నెల 11, బుధవారానికి వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పంచాయతీరాజ్ ఉద్యోగి ఆస్తులపై ఏసీబీ రైడ్స్.. ఇరు తెలుగు రాష్ట్రాల్లో సోదాలు..
రాజమండ్రిలో పెద్ద పులి భయం.. ఫారెస్ట్ బృందం చర్యలు